‘జానీ’ ఫ్లాప్‌: అన్నయ్య ఈ పుస్తకం ఇచ్చారు!
close
Published : 23/04/2020 21:50 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘జానీ’ ఫ్లాప్‌: అన్నయ్య ఈ పుస్తకం ఇచ్చారు!

హైదరాబాద్‌: ‘డబ్బుతో కొనలేని అలౌకిక ఆనందాన్ని అందించేది పుస్తకం’ అంటున్నారు సినీ నటుడు, జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌. ప్రపంచ పుస్తక దినోత్సవం సందర్భంగా ఓ ఆసక్తికర విషయాన్ని ఆయన ట్విటర్‌ వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ఆయన స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘జానీ’. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద బోల్తా కొట్టింది. అభిమానులను తీవ్ర నిరాశపరిచింది. కాగా, శిష్టా ఆంజనేయశాస్త్రి రాసిన ‘ఖారవేలుడు’ పుస్తకాన్ని అభిమానులతో పంచుకుంటూ.. ‘‘శిష్టా ఆంజనేయశాస్త్రి రచించిన ఈ ‘ఖారవేలుడు’ రాజకీయం పట్ల నా ఆలోచనా ధోరణిని మార్చేసింది. నా దర్శకత్వంలో వచ్చిన ‘జానీ’ ప్లాప్‌ అయినప్పుడు నా రెండో సోదరుడు నాగబాబు ఈ పుస్తకాన్ని నాకు అందించారు. ఈ అద్భుత పుస్తకం తర్వాత నాకు రాజకీయంగా మార్గ నిర్దేశాన్ని చేసింది. అంటూ అందులోని కొన్ని పంక్తులను పంచుకున్నారు. 

ఇక పుస్తకం ప్రాధాన్యతను తెలుపుతూ, ‘‘డబ్బుతో కొనలేని అలౌకిక అందాన్ని అందించేది పుస్తకం.. చేతిలో చిల్లి గవ్వలేకపోయినా విజ్ఞాన సంపన్నునిగా మార్చేది పుస్తకం. దోచుకోవడానికి అవకాశం లేని సంపదను ఇచ్చేది పుస్తకం. మనలోని అజ్ఞానాన్ని పారద్రోలి.. మన మస్తకాన్ని తాజాగా ఉంచేది పుస్తకం’’ అంటూ పుస్తక పఠనంపై సందేశాన్ని ఇచ్చారు. మహత్తరమైన శక్తి కలిగిన పుస్తకాన్ని మన దిన చర్యలో భాగం చేద్దామని, ఈ స్వీయ నిర్బంధ కాలంలో పుస్తక పఠనంతో మానసిక దృఢత్వాన్ని పెంచుకోవాలని అందరికీ పిలుపునిచ్చారు. దీంతో పాటు వ‌న‌వాసి, అమృతం కురిసిన రాత్రి త‌దిత‌ర పుస్త‌కాల గురించి త‌న ట్విట‌ర్‌లో రాసుకొచ్చారు ప‌వ‌న్‌.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని