మెగాఫోన్‌ పట్టిన చేత్తోనే గరిటె పట్టారు!
close
Published : 23/04/2020 22:12 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మెగాఫోన్‌ పట్టిన చేత్తోనే గరిటె పట్టారు!

హైదరాబాద్‌: ప్రస్తుతం టాలీవుడ్‌కు #BeTheRealMan ఫీవర్‌ పట్టుకుంది. అగ్ర నటులు, దర్శకులు, సంగీత దర్శకులు ఒకరిపై ఒకరు ఛాలెంజ్‌ విసురుకుంటూ ఇంటి పనుల్లో మహిళలకు సాయం చేస్తున్నారు. ఆ వీడియోలను సామాజిక మాధ్యమాల వేదికగా పంచుకుంటున్నారు. ఇందులో భాగంగా సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి విసిరిన సవాల్‌ను దర్శకుడు క్రిష్‌ జాగర్లమూడి పూర్తి చేశారు. మొక్కలకు నీళ్లుపోసి, ఇల్లు తుడిచి, వంట చేసి వాళ్ల అమ్మ కోసం పట్టుకెళ్లారు. ఆ తర్వాత ఈ ఛాలెంజ్‌ను పవన్‌కల్యాణ్‌ ఫ్యాన్స్‌ పూర్తి చేయాల్సిందిగా సవాల్‌ విసిరారు. 

మరో దర్శకుడు బోయపాటి శ్రీను కూడా గరిటె పట్టారు. అయితే, ఇది #BeTheRealMan ఛాలెంజ్‌లో మాత్రం భాగం కాదు. క్వారంటైన్‌ టైమ్‌లో సరదాగా తన కుటుంబానికి వంట చేసి పెడుతున్న వీడియోను పంచుకున్నారు. బోయపాటి వంట చేయడంలో వాళ్ల పిల్లలు సాయం చేశారు. మెగా ఫోన్‌ పట్టి యాక్షన్‌ చెప్పే దర్శకులు ఇలా గరిటె పట్టి వంట చేయడం ఆసక్తిని రేకెత్తిస్తోంది.





మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని