లాక్‌డౌన్‌ వేళ.. సినీ తారలు ఇలా
close
Published : 26/04/2020 21:11 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

లాక్‌డౌన్‌ వేళ.. సినీ తారలు ఇలా

హైదరాబాద్‌: ఓ స్టార్‌ హీరో కుమార్తెతో కలిసి వ్యాయామం‌ చేస్తుంటే.. మరో నటి పియానో వాయిస్తుంది. ఒక బుల్లితెర యాంకర్‌ స్నేహితులతో కలిసి హైడ్‌ అండ్‌ సీక్‌ ఆడుతుంటే మరో నటుడు గ్రిల్‌ చికెన్‌ తయారు చేయడం ఎలాగో చూపిస్తున్నాడు. కరోనా వైరస్‌ కారణంగా అనుకోకుండా షూటింగ్స్‌ నుంచి ఖాళీ దొరకడంతో బుల్లితెర, వెండితెర అనే తేడా లేకుండా తారలందరూ ఇంటికే పరిమితమయ్యారు. అనుకోకుండా క్వారంటైన్‌ డేస్‌ రావడంతో వాళ్లందరూ ఇంట్లోనే ఉంటూ కుటుంబంతో సేద తీరుతున్నారు. క్వారంటైన్‌లో ఉన్న సెలబ్రిటీలు ఏం చేస్తున్నారో ఓ లుక్కేద్దాం

కుమార్తెతో బన్నీ ఎక్సర్‌సైజ్‌

‘స్టైలిష్‌స్టార్’‌ అల్లు అర్జున్‌ క్వారంటైన్‌ లైఫ్‌ను కుటుంబంతో సరదాగా గడుపుతున్నారు. ‘పుష్ప’ సినిమా షూటింగ్‌ వాయిదా పడడంతో ఇంట్లో ఉన్న ఆయన ఫిట్‌నెస్‌ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. తాజాగా ఆయన తన కుమార్తె అర్హకి ఎక్సర్‌సైజ్‌లు‌ నేర్పించారు. దీనికి సంబంధించిన ఫొటోను బన్నీ సతీమణి స్నేహరెడ్డి ఇన్‌స్టా వేదికగా షేర్‌ చేసింది.

పియానో వాయిస్తున్న హృతిక్‌, భూమిక

బాలీవుడ్‌ నటుడు హృతిక్‌ రోషన్‌ లాక్‌డౌన్‌ను కుటుంబంతో కలిసి సరదాగా గడుపుతున్నారు. తాజాగా ఆయన పియోనో వాయిస్తున్న ఓ వీడియోను ఇన్‌స్టా వేదికగా షేర్‌ చేశారు. మరోవైపు టాలీవుడ్‌ నటి భూమిక సైతం పియానో వాయిస్తున్న ఓ వీడియోను ఇన్‌స్టా వేదికగా షేర్‌ చేసింది.


మధుర జ్ఞాపకాలతో నమ్రత

మహేశ్‌బాబు సతీమణి నమ్రత గత కొన్నిరోజులుగా సితార, గౌతమ్‌లకు సంబంధించిన పాత వీడియోలను నెట్టింట్లో పోస్ట్‌ చేస్తున్నారు. తాజాగా ఆమె గౌతమ్‌కు సంబంధించిన ఓ వీడియోను అభిమానులతో పంచుకున్నారు. న్యూయార్క్‌ టూర్‌కు వెళ్లినప్పటి వీడియో ఇది.


సుమక్క ‘సూపర్‌ 2’

ప్రముఖ యాంకర్‌ సుమ, గెటప్‌ శ్రీను, ఆటో రాంప్రసాద్‌తో ‘సూపర్‌ 2’ గేమ్‌ షోను నిర్వహించారు. లాక్‌డౌన్‌ కారణంగా ఎవరి ఇళ్లల్లో వాళ్లే ఉండి ఈ వీడియోను చిత్రీకరించారు. ప్రేక్షకులను ఎంటర్‌టైన్‌ చేసేందుకు ఈ వీడియోను రూపొందించినట్లు ఆమె తెలిపారు.

యాంకర్ల హైడ్‌ అండ్‌ సిక్‌

బుల్లితెర వ్యాఖ్యాతలు రవి, అనసూయ, రాహుల్‌, అలీ రాజా అలాగే రవి కుమార్తె వియా సరదాగా హైడ్‌ అండ్‌ సిక్‌ ఆడారు. కరోనాపై అవగాహన కల్పిస్తూ రూపొందించిన ఈ వీడియోని వాళ్ల వాళ్ల ఇళ్లలో ఉండే చిత్రీకరించారు.

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని