నాకు ఈ సన్నివేశాలంటే భలే ఇష్టం: వెంకీ
close
Published : 27/04/2020 22:26 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

నాకు ఈ సన్నివేశాలంటే భలే ఇష్టం: వెంకీ

‘ఆడవారి మాటలకు అర్థాలే వేరులే..’కు 13 ఏళ్లు

హైదరాబాద్‌: ‘ఆడవారి మాటలకు అర్థాలే వేరులే..’ సినిమాలో కోట శ్రీనివాసరావుకు, తనకు మధ్య వచ్చే సన్నివేశాలంటే చాలా ఇష్టమని విక్టరీ వెంకటేష్‌ చెప్పారు. సెల్వరాఘవన్‌ దర్శకత్వం వహించిన చిత్రమిది. త్రిష కథానాయిక. ఈ సినిమా విడుదలై సోమవారంతో 13 ఏళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా వెంకీ, త్రిష సోషల్‌మీడియా వేదికగా స్పందించారు. సినిమాలోని సన్నివేశాలతో కూడిన వీడియోను కూడా వెంకీ షేర్‌ చేశారు. ‘ఈ అద్భుతమైన కథలో నన్ను భాగస్వామిని చేసినందుకు సెల్వరాఘవన్‌కు, నాకు అమేజింగ్‌ సహనటిగా ఉన్న త్రిషకు, చక్కటి సంగీతం అందించిన రాజ యువన్‌కు ధన్యవాదాలు. ఈ సినిమాలోని వివిధ రకాల భావోద్వేగాలు నాకెంతో ఇష్టం. ప్రత్యేకించి కోట శ్రీనివాసరావు గారికి, నాకు మధ్య వచ్చే సన్నివేశాలు చాలా నచ్చాయి. ఈ చిత్రానికి విశేషమైన స్పందన వచ్చింది. అంతేకాదు ఇందులోని పాత్రకు గానూ నన్ను చాలా మంది వ్యక్తిగతంగా అభినందించారు’ అని వెంకీ ట్వీట్లు చేశారు. దీనికి త్రిష స్పందిస్తూ.. ‘నేను మీకు ధన్యవాదాలు చెప్పాలి’ అని పేర్కొన్నారు.

వెంకీకి దర్శకుడు సెల్వరాఘవన్‌ రిప్లై ఇస్తూ.. ‘థాంక్యూ సర్‌. ఈ విషయంలో నేను అదృష్టవంతుడ్ని. మీలాంటి లెజెండ్‌తో కలిసి పనిచేయడం నాకెంతో సంతోషాన్ని ఇచ్చింది. నేను పేపర్‌పై పెన్నుతో రాసుకున్న కథకు మీరు, త్రిష జీవం పోశారు’ అని పేర్కొన్నారు. ‘నాకు కూడా ఈ సినిమా పాటలంటే చాలా ఇష్టం. మీరు, సెల్వరాఘవన్‌, నిర్మాత వల్ల ఇది సాధ్యమైంది’ అని రాజ యువన్‌ స్పందించారు.  

 
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని