130 సెకన్లలో ‘బాహుబలి2’ చూశారా?
close
Published : 28/04/2020 14:45 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

130 సెకన్లలో ‘బాహుబలి2’ చూశారా?

ఇంటర్నెట్‌డెస్క్‌: తెలుగు చిత్ర పరిశ్రమ ఖ్యాతిని అంతర్జాతీయ వేదికలపై నిలబెట్టిన చిత్రం ‘బాహుబలి’. రెండు భాగాలుగా వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద కాసుల వర్షాన్ని కురిపించింది. తొలి భాగం ‘బాహుబలి: ది బిగినింగ్‌’ చివరిలో ‘బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు’ అన్న ఒక్క ప్రశ్నకు సమాధానం కోసం సినీ అభిమానులు రెండేళ్ల పాటు వేచి చూశారు. అలా ఏప్రిల్‌ 28, 2017న విడుదలైన ‘బాహుబలి: ది కన్‌క్లూజన్‌’ నేటికి మూడేళ్లు పూర్తి చేసుకుంది. ఎస్‌.ఎస్‌.రాజమౌళి దర్శకత్వ ప్రతిభ, ప్రభాస్‌, రానా, అనుష్క, రమ్యకృష్ణ, సత్యరాజ్‌, నాజర్‌ల నటన సినిమాను మరోస్థాయిలో నిలబెట్టాయి.

‘బాహుబలి2’ విడుదలై మూడేళ్లు అయిన సందర్భంగా ట్విటర్‌ వేదికగా శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. చిత్రీకరణ సందర్భంగా తీసిన అరుదైన ఫొటోలను చిత్ర బృందం అభిమానులతో పంచుకుంది. ఇక ఈ సినిమా విడుదలై మూడేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్మాత శోభు యార్లగడ్డ అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ‘‘ఏప్రిల్‌ 28 భారతీయ సినిమా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిన రోజు. చరిత్ర సృష్టించింది. బాక్సాఫీస్‌లు బద్దలు కొట్టింది. గతంలో ఏ చిత్రమూ సాధించని విధంగా వెయ్యి కోట్లు వసూళ్లు సాధించింది. ‘జై మాహిష్మతి’’ అని బాహుబలి చిత్ర బృందం ట్వీట్‌ చేసింది. 

 

కాగా, ‘బాహుబలి: ది కన్‌క్లూజన్‌’ సినిమా మొత్తాన్ని 10ఎక్స్‌ స్పీడ్‌లోకి మార్చి ఓ అభిమాని పంచుకున్న వీడియో వైరల్‌ అయింది. హైలైట్‌ సన్నివేశాల వచ్చినప్పుడు స్లోమోషన్‌లో చూపించిన ఈ వీడియో ప్రస్తుతం నెటిజన్లను ఆకట్టుకుంటోంది.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని