ఆ విషయం నాగ్‌ సర్‌కి చెప్పా: లావణ్య త్రిపాఠి
close
Published : 02/05/2020 10:33 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఆ విషయం నాగ్‌ సర్‌కి చెప్పా: లావణ్య త్రిపాఠి

హైదరాబాద్‌: బోల్డ్‌ సన్నివేశాల్లో నటించడానికి తనకు ఎలాంటి అభ్యంతరం లేదని కథానాయిక లావణ్య త్రిపాఠి చెప్పారు. ‘అందాల రాక్షసి’తో గుర్తింపు పొందిన ఈ భామ.. ‘భలే భలే మగాడివోయ్‌’, ‘సోగ్గాడే చిన్ని నాయనా’ సినిమాలతో విజయాలను అందుకున్నారు. గత ఏడాది ఆమె నటించిన ‘అర్జున్‌ సురవరం’ సినిమా హిట్‌ అందుకుంది. దీని తర్వాత లావణ్య ‘ఏ1 ఎక్స్‌ప్రెస్‌’కు సంతకం చేశారు. సందీప్‌ కిషన్‌ కథానాయకుడు. తాజాగా లావణ్య తన కెరీర్‌, పాత్రల గురించి ఓ వెబ్‌సైట్‌తో ముచ్చటించారు. సినిమాల ఎంపిక విషయంలో కొన్ని పొరపాట్లు చేసినట్లు చెప్పారు. అగ్ర కథానాయకుడు అక్కినేని నాగార్జున తనకు ఎంతో మద్దతుగా ఉన్నారని అన్నారు.

‘‘సోగ్గాడే..’ సినిమాకు కాస్త ఇబ్బందిగానే సంతకం చేశా. సీనియర్‌ హీరోకు జంటగా నటిస్తే భవిష్యత్తులో సమస్యలు ఎదురవుతాయని చాలా మంది నాకు చెప్పారు. ఇదే విషయాన్ని నాగ్‌ సర్‌కు చెప్పా. అప్పుడు ఆయన నన్ను సపోర్ట్‌ చేసిన విధానం అద్భుతం. ఇప్పటికీ నా జీవితానికి సంబంధించిన ముఖ్యమైన నిర్ణయాల్ని తీసుకోవడానికి ముందు నాగార్జునగారి సలహాలు తీసుకుంటుంటా. ఆయన  నాకు మార్గదర్శకం’ అని చెప్పారు.

అనంతరం లావణ్య తన తదుపరి చిత్రం ‘ఏ1 ఎక్స్‌ప్రెస్‌’ గురించి మాట్లాడుతూ.. ‘సినిమా సిద్ధమవుతోంది. దీనిపై ఎన్నో ఆశలు పెట్టుకుని ఉన్నా. ఇందులో నా పాత్ర సవాలుతో కూడుకున్నది. అదేవిధంగా తమిళంలో ఓ సినిమాలో నటిస్తున్నా. కార్తికేయ ‘చావు కబురు చల్లగా..’ సినిమా చేస్తున్నా. ఇందులో నా పాత్ర సూపర్‌గా ఉంటుంది, మీరు సర్‌ప్రైజ్ అవుతారు’ అని పేర్కొన్నారు.

ఓ నటిగా నా పాత్రలు సవాలుతో కూడుకుని ఉండాలని కోరుకుంటుంటా. కథ డిమాండ్‌ చేస్తే.. బోల్డ్‌ సన్నివేశాల్లో నటించడం, పొట్టిదుస్తులు వేసుకోవడానికి సిద్ధమే. ఓటీటీ ఫ్లాట్‌ఫాం ఎన్నో ఛాలెంజింగ్‌ పాత్రల్ని సృష్టిస్తోంది. నా నైపుణ్యాన్ని నిరూపించుకోవడానికి అలాంటి పాత్రల కోసం ఎదురుచూస్తున్నా’ అని ఆమె తెలిపారు.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని