దేవిశ్రీ మ్యూజిక్‌ లైవ్‌ షో.. అదరహో..!
close
Published : 02/05/2020 20:55 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

దేవిశ్రీ మ్యూజిక్‌ లైవ్‌ షో.. అదరహో..!

వీడియో షేర్‌ చేసిన రాక్‌స్టార్‌

హైదరాబాద్‌: రాక్‌స్టార్‌ దేవిశ్రీ ప్రసాద్‌ ‘వన్‌ నేషన్ ఎట్‌ హోమ్‌’లో పాల్గొని వీక్షకుల్లో హుషారు నింపారు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్‌ సమర్పించింది. దీని ద్వారా వచ్చిన విరాళాలను పేదల కోసం ఉపయోగించనున్నారు. ఏప్రిల్‌ 30న జరిగిన ఈ ప్రదర్శనలో దేవిశ్రీ అభిమానులకు ఇష్టమైన పాటల్ని ఆలపించారు. ‘జల్సా’లోని ‘మై హార్ట్‌ ఈజ్‌ బీటింగ్‌’, ‘ఆర్య 2’లోని ‘ఉప్పెనంత ప్రేమకు..’, ‘రంగస్థలం’లోని ‘ఎంత సక్కగున్నావే..’తోపాటు పలు తమిళ గీతాలు కూడా ఆలపించారు. తనదైన స్టెప్పులతో వీక్షకుల్లో ఉత్సాహం నింపారు. ప్రేక్షకులు ఎంతో మెచ్చిన పాటల్ని మిక్స్‌ చేసి, ఆయన పాడారు. తన ప్రదర్శనకు సంబంధించిన వీడియోను దేవిశ్రీ శనివారం సాయంత్రం అభిమానులతో ప్రత్యేకంగా పంచుకున్నారు.

‘‘వన్‌ నేషన్‌ ఎట్‌ హోమ్‌’ లైవ్‌లో నా ప్రదర్శన ఇదిగో.. మీరంతా దీన్ని మెచ్చినందుకు ధన్యవాదాలు. మెలోడీస్‌, డ్యాన్స్‌ గీతాల్ని మిక్స్‌ చేశా’ అని దేవిశ్రీ ట్వీట్‌ చేశారు. ఇంట్లో సురక్షితంగా ఉండమని, కరోనాను కలిసి జయిద్దామని ఈ సందర్భంగా లైవ్‌ చివర్లో దేవిశ్రీ సందేశం ఇచ్చారు. ఈ షోలో దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ కళాకారులు తమ ప్రదర్శన ఇచ్చారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఇళ్లకే పరిమితమైన ప్రజలకు వినోదం పంచడం ఈ ‘వన్‌ నేషన్‌ ఎట్‌ హోమ్‌’ మరో ఉద్దేశం.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని