బాసూ.. చూపించాడు తన గ్రేస్‌..!
close
Published : 03/05/2020 20:28 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

బాసూ.. చూపించాడు తన గ్రేస్‌..!

హైదరాబాద్‌: అదిరిపోయే డ్యాన్స్‌లు.. థియేటర్‌ దద్దరిల్లే ఫైట్స్‌తో అశేష అభిమానులను సొంతం చేసుకున్నారు అగ్ర కథానాయకుడు చిరంజీవి. ఆయన వెండితెరపై డ్యాన్స్‌ చేస్తుంటే ప్రేక్షకుల ఆనందానికి అవధులు ఉండవు. ముఖ్యంగా 80ల్లో చిరు మాస్‌ ఇమేజ్‌ తేవడానికి ఇవి ఎంతో దోహదపడ్డాయి. రీఎంట్రీ చిత్రం ‘150’తోనూ తనలో క్రేజ్‌.. గ్రేస్‌ తగ్గలేదని నిరూపించారు. 

80ల నాటి తారలందరూ ఏటా ఎక్కడో ఒక చోట కలుస్తుంటారు. ఇటీవల చిరంజీవి నివాసం అందుకు వేదికైన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆనాటి నటీమణులతో కలిసి చిందేసిన వీడియోను చిరంజీవి అభిమానులతో పంచుకున్నారు. ఈ వీడియోలో ఆయన సుహాసిని, రాధా, ఖుష్భూ, జయసుధ, జయప్రద తదితరులతో కలిసి డ్యాన్స్‌ చేశారు. ప్రస్తుతం ఆ వీడియో సామాజిక మాధ్యమాల వేదికగా వైరల్‌ అవుతోంది. మీరూ చూడండి.. బాస్‌ చూపించిన గ్రేస్‌...




మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని