చిరంజీవి స్వీటెస్ట్‌‌ లెజెండ్‌: త్రిష ట్వీట్‌
close
Published : 05/05/2020 16:35 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

చిరంజీవి స్వీటెస్ట్‌‌ లెజెండ్‌: త్రిష ట్వీట్‌

హైదరాబాద్‌: దక్షిణాదిలో అగ్ర కథానాయికగా రాణిస్తున్న ముద్దుగుమ్మ త్రిష మంగళవారం పుట్టినరోజు జరుపుకొన్నారు. ఈ సందర్భంగా ఆమెకు సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. వీరందరికీ త్రిష కృతజ్ఞతలు తెలిపారు. ఇదే సందర్భంగా మెగాస్టార్‌ చిరంజీవి కూడా తన సహనటిని విష్‌ చేశారు. ‘జన్మదిన శుభాకాంక్షలు త్రిష. నీ జీవితం సంతోషం, విజయంతో నిండిపోవాలని కోరుకుంటున్నా. ఈ ఏడాది నీకు గొప్పగా ఉండాలని ఆశిస్తున్నా’ అని ట్వీట్‌ చేశారు. దీనికి త్రిష రిప్లై ఇచ్చారు. ‘స్వీటెస్ట్‌ లెజెండ్‌ చిరంజీవికి ధన్యవాదాలు’ అని పోస్ట్‌ చేశారు. ‘ఆచార్య’ నుంచి త్రిష వైదొలిగిన తర్వాత ఆమెకు, చిరుకు మధ్య జరిగిన సంభాషణ కావడంతో ఇది అందరి దృష్టిని ఆకర్షించింది. వీరిద్దరు కలిసి ‘స్టాలిన్‌’ సినిమాలో జంటగా నటించిన సంగతి తెలిసిందే.

‘సైరా నరసింహారెడ్డి’ తర్వాత చిరు కథానాయకుడిగా నటిస్తున్న సినిమా ‘ఆచార్య’. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో కథానాయికగా త్రిష సంతకం చేశారు. కొన్ని రోజులు షూటింగ్‌లో పాల్గొన్నారు. కానీ పలు కారణాల వల్ల ఆమె ప్రాజెక్టు నుంచి వైదొలిగారు. దీంతో ఆమె స్థానంలో కాజల్‌ను చిత్ర బృందం ఎంచుకుంది. లాక్‌డౌన్‌ పూర్తయిన తర్వాత ఆమె షూటింగ్‌లో పాల్గొనబోతున్నారు. కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థలు సంయుక్తంగా ఈ సినిమాను  నిర్మిస్తున్నాయి. త్రిష గత ఏడాది ‘పేట’ సినిమాతో హిట్‌ అందుకున్నారు. ప్రస్తుతం ఆమె చేతిలో దాదాపు ఐదు తమిళ ప్రాజెక్టులు ఉన్నాయి.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని