అప్పుడు బికినీ ధరించడం ఇష్టం లేదని చెప్పా!
close
Published : 08/05/2020 09:27 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అప్పుడు బికినీ ధరించడం ఇష్టం లేదని చెప్పా!

హైదరాబాద్‌: కథానాయికగా వరుస సినిమాలతో దూసుకెళ్తున్న ముద్దుగుమ్మ రకుల్‌ప్రీత్‌ సింగ్‌. అంతేకాదు సామాజిక మాధ్యమాల వేదికగానూ ఎంతో చురుగ్గా ఉంటుంది. మిస్‌ ఇండియా పోటీల్లో బికినీ ధరించే విషయమై ఎంతో ఇబ్బంది పడ్డానని కానీ, తన తల్లి ప్రోత్సాహంతో ధైర్యంగా ముందడుగు వేశానని తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పింది.

‘‘నేను ‘మిస్‌ ఇండియా’ పోటీల్లో పాల్గొనాలన్నది మా అమ్మ కోరిక. అయితే, అందుకు చాలా తతంగం ఉంటుందని, బికినీలు కూడా ధరించాలని అమ్మతో చెబుతూ ఉండేదాన్ని. అంతేకాదు, నాకు బికినీ ధరించడం కూడా ఇష్టం లేదు. అయితే, ఆమె ఎంతో నమ్మకంతో ఉండేది. ‘నువ్వు అందుకు సిద్ధం అవ్వు. బికినీ ధరిస్తే ఏమవుతుంది. నువ్వు తప్పకుండా పోటీకి వెళ్లాలి’ అని ధైర్యం చెప్పింది. ఈ విషయంలో నాన్న కూడా అడ్డు చెప్పలేదు. సాధారణంగా ఇలాంటి విషయాల్లో తల్లిదండ్రులు కాస్త వెనకడుగు వేస్తారు. కానీ, మా అమ్మానాన్నలు మాత్రం ముందుకు నడిపించారు’’

‘‘మా నాన్న సైన్యంలో పనిచేస్తుండటం వల్ల తరచూ బదిలీలు ఉండేవి. నేను నటిగా మారాక తమ్ముడు అమన్‌ క్రీడల్లో పాల్గొనేవాడు. అమన్‌ కోసం నాన్న తన ఆర్మీ ఉద్యోగానికి రాజీనామా చేశాడు. ఇప్పుడిలా నటిగా మారానంటే ఇదంతా అమ్మానాన్నల చలువే అని’’ చెప్పింది. ప్రస్తుతం రకుల్‌ వరుస సినిమాలో బిజీగా ఉంది. ‘చలే చలో’, ‘ఇండియన్‌2’, ‘థ్యాంక్‌ గాడ్‌’ చిత్రాలతో పాటు, తెలుగులో చంద్రశేఖర్‌ యేలేటి దర్శకత్వంలో ఓ చిత్రంలో నటిస్తోంది. 

 
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని