మెడికల్‌ స్టోర్‌లో మద్యం అమ్ముతారా..?
close
Published : 08/05/2020 14:01 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మెడికల్‌ స్టోర్‌లో మద్యం అమ్ముతారా..?

రకుల్‌ప్రీత్ సింగ్‌

హైదరాబాద్‌: మెడికల్‌ స్టోర్‌లో మద్యం కూడా అమ్ముతారా..? అని అడుగుతున్నారు కథానాయిక రకుల్‌ ప్రీత్‌ సింగ్‌. లాక్‌డౌన్‌ సడలింపుల నేపథ్యంలో రకుల్‌ మద్యం కొనుగోలు చేశారంటూ సోషల్‌ మీడియాలో వస్తోన్న వార్తలపై ఆమె ఘాటుగా స్పందించారు. 

లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఇంట్లో సోదరుడితో కలిసి ఉంటున్న రకుల్‌ ఇటీవల జనసమూహాంలోకి వచ్చారు. తన ఇంటికి సమీపంలో ఉన్న ఓ మెడికల్‌ షాపునకు వెళ్లి  మందులు కొనుగోలు చేసి తెచ్చుకున్నారు. కాగా, మెడికల్‌ షాపు నుంచి వస్తున్న రకుల్‌ను చూసి గుర్తుపట్టిన ఓ అభిమాని ఆమెను వీడియో తీశాడు. ఈ వీడియో నెట్టింట్లో చక్కర్లు కొట్టింది. దీంతో ఓ బాలీవుడ్‌ వెబ్‌సైట్‌ ఈ వీడియోను పోస్ట్‌ చేస్తూ.. ‘లాక్‌డౌన్‌లో రకుల్‌ ఏం కొనుగోలు చేయడానికి బయటకు వచ్చారు? ఆమె మద్యం కొనుగోలు చేశారా?’ అని పేర్కొంది. దీనిపై రకుల్‌ ట్విటర్‌ వేదికగా స్పందించారు. సదరు సైట్‌ పెట్టిన ట్వీట్‌ను రీట్వీట్‌ చేస్తూ.. ‘వావ్‌..!! మెడికల్‌ షాపులో కూడా మద్యం అమ్ముతారనే విషయం నాకు ఇప్పటివరకూ తెలియదు’ అని వ్యంగ్యంగా సమాధానం ఇచ్చారు.




మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని