ముందస్తుగా జీతాలిచ్చేసిన ఎన్టీఆర్‌
close
Published : 08/05/2020 14:47 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ముందస్తుగా జీతాలిచ్చేసిన ఎన్టీఆర్‌

ఎప్పుడు కావాలన్నా సాయం చేస్తానని మాటిచ్చారట

హైదరాబాద్‌: లాక్‌డౌన్‌ నేపథ్యంలో కథానాయకుడు ఎన్టీఆర్‌ తన ఇంట్లో, కార్యాలయంలో పనిచేస్తున్న ఉగ్యోగులకు ముందస్తుగా జీతాలు చెల్లించేశారట. కరోనా వైరస్‌ నేపథ్యంలో అందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. అన్నీ కార్యాలయాల్ని మూసేశారు. ఈ నేపథ్యంలో తన వద్ద పనిచేస్తున్న ఉద్యోగులు సమస్యలు ఎదుర్కోకుండా తారక్‌ జీతాల్ని చెల్లించేసినట్లు సమాచారం. ‘ఎన్టీఆర్‌ తన దగ్గర పనిచేస్తున్న ఉద్యోగులందరికీ ముందస్తుగా జీతాలు చెల్లించేశారు. అంతేకాదు ఎప్పుడు ఆర్థిక అవసరం వచ్చినా సాయం చేస్తానని ప్రామిస్‌ చేశారు. కరోనా వైరస్‌ వల్ల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన అర్థం చేసుకున్నారు. తన చుట్టూ ఉన్న వారికి సాయం చేయడానికి ముందుకొస్తున్నారు’ అని విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి.

కరోనాతో పోరు కోసం ఎన్టీఆర్‌ ఇప్పటి వరకు రూ.75 లక్షలు విరాళం అందించారు. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.25 లక్షలు, తెలంగాణ ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.25 లక్షలు, సినీ కార్మికుల కోసం రూ.25 లక్షలు విరాళంగా ఇచ్చారు. ఎప్పుడూ షూటింగ్‌లతో బిజీగా ఉండే ఎన్టీఆర్‌ లాక్‌డౌన్‌ వల్ల తన కుటుంబ సభ్యులతో విలువైన సమయాన్ని గడుపుతున్నారు. లాక్‌డౌన్‌ ఎత్తివేసిన తర్వాత‌ ‘ఆర్‌.ఆర్‌.ఆర్’ సినిమా షూటింగ్‌లో పాల్గొనబోతున్నారు. ఎస్‌.ఎస్‌. రాజమౌళి ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో రామ్‌చరణ్‌ మరో కథానాయకుడు. 2021 జనవరి 8న ఈ సినిమాను విడుదల చేయబోతున్నట్లు ఇప్పటికే ప్రకటించారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని