దయచేసి అనుమతి ఇవ్వండి: లారెన్స్‌
close
Published : 09/05/2020 07:01 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

దయచేసి అనుమతి ఇవ్వండి: లారెన్స్‌

కోడంబాక్కం, న్యూస్‌టుడే: ఓ పాత్రికేయుడి తల్లి పార్థివదేహాన్ని కేరళ నుంచి తమిళనాడుకు పంపడానికి సహకరించాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ను దర్శక నటుడు లారెన్స్‌ కోరారు. ఈ విషయమై ఆయన కేరళ సీఎంకు పంపించిన లేఖలో.. ‘‘కేరళ ప్రభుత్వం చేపడుతున్న కరోనా నియంత్రణ చర్యలను చూసి ఆశ్చర్యపోతున్నాం. ఇటీవల కేరళకు సహకరించే నిమిత్తం మా అమ్మతో వచ్చి మిమ్మల్ని కలిసి సహాయ నిధిని అందించిన విషయాన్ని గౌరవంగా భావిస్తున్నాం. ఇప్పుడు మీకు ఒక చిన్న విన్నపం. తిరువనంతపురంలోని ఎన్‌ఐఎంఎస్‌ వైద్యశాలలో తమిళనాడుకు చెందిన పేద పాత్రికేయుడు అశోక్‌ తల్లి అనారోగ్యంతో చికిత్స పొందుతూ గురువారం రాత్రి తుది శ్వాస విడిచారు. ఆమె భౌతికకాయాన్ని కన్యాకుమారిలోని స్వస్థలానికి తీసుకురావాల్సి ఉంది. అయితే కరోనాతో వైద్యశాలకు చెల్లించాల్సిన రూ.1.50 లక్షల చెల్లించలేని పరిస్థితుల్లో అశోక్‌ ఉన్నారు. అతనికి సహకరించి.. భౌతికకాయాన్ని స్వస్థలానికి పంపడానికి అనుమతి ఇవ్వండి. వైద్యశాలకు చెల్లించాల్సిన డబ్బును ఒకట్రెండు రోజుల్లో నేనే చెల్లిస్తానని’’ రాఘవ లారెన్స్‌ పేర్కొన్నారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని