మన ప్రయాణం ఆమె నుంచే ప్రారంభమవుతుంది..!
close
Updated : 10/05/2020 12:09 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మన ప్రయాణం ఆమె నుంచే ప్రారంభమవుతుంది..!

ఆసక్తికర ఫొటోలతో సెలబ్రిటీల మదర్స్‌ డే శుభాకాంక్షలు

హైదరాబాద్‌: ‘మన కథలన్నింటి వెనుక అమ్మ కథ ఉంటుంది. ఎందుకంటే మన ప్రయాణం ఆమె నుంచే ప్రారంభమవుతుంది. ఎన్నో మధురజ్ఞాపకాలు..’ అంటూ తన అమ్మతో ఉన్న అనుబంధాన్ని అగ్రకథానాయకుడు చిరంజీవి గుర్తు చేసుకున్నారు.  ‘అమ్మ.. నువ్వు నాపై చూపించే ప్రేమాభిమానులు నా జీవితంలో ఎప్పటికీ మారవు. ఈ ప్రపంచంలోకెల్లా అద్భుతమైన అమ్మగా ఉన్నందుకు ధన్యవాదాలు. భూమ్మీద ఉన్న అమ్మలందరికీ హ్యాపీ మదర్స్‌ డే’ అని అంటున్నారు మంచు మనోజ్‌. ఆదివారం మాతృదినోత్సవాన్ని పురస్కరించుకుని పలువురు సినీ తారలు అమ్మలతో తమకున్న అనుబంధాన్ని సోషల్‌మీడియా వేదికగా నెటిజన్లతో పంచుకున్నారు.

 

‘ఉన్నత శిఖరాలకు వెళ్లినా సరే ఒదిగి ఉండాలనే గొప్ప విషయాన్ని మా అమ్మ నుంచి నేర్చుకున్నాను. హ్యాపీ మదర్స్‌ డే అమ్మ’ - అల్లు అర్జున్‌

‘అమ్మలందరికీ మాతృదినోత్సవ శుభాకాంక్షలు. నువ్వు మాకోసం చేసిన త్యాగాలకు, మాపై చూపించిన అమితమైన ప్రేమకు, ఇప్పటివరకూ ఎన్నో మంచి విషయాలను నేర్పించినందుకు ధన్యవాదాలు అమ్మ. నీకు ఎంతో ఇష్టమైన కుమారుడిని నేనే అయినందుకు సంతోషిస్తున్నాను.’ - అల్లు శిరీష్‌

‘మన కోసం ఎన్నో త్యాగాలను చేసి.. ఎంతో క్లిష్టమైన జీవన ప్రయాణాన్ని కొనసాగిస్తున్న అమ్మకు మాతృదినోత్సవ శుభాకాంక్షలు. అమ్మను మించి గొప్పదనం ఈ ప్రపంచంలో మరొకటి లేదు.’ - తమన్‌

‘నా జీవితంలోని ఇద్దరు మార్గదర్శకులకు, ప్రపంచం మొత్తం మీద ఉన్న తల్లులందరికీ మాతృదినోత్సవ శుభాకాంక్షలు’ - మహేశ్‌ బాబు

‘కొన్ని జ్ఞాపకాలు ప్రతిఒక్కరికీ జీవితాంతం గుర్తుంటాయి. అలాంటి జ్ఞాపకాలు మా అమ్మతో నాకు ఎన్నో ఉన్నాయి. వాటిని ఎప్పటికీ గుర్తు పెట్టుకుని సంతోషిస్తున్నాను. నిన్ను మిస్‌ అవుతున్నాను అమ్మ’ -శ్రీనువైట్ల

‘జీవితంలోని ఎన్నో విషయాలకు నాకు ఉదాహరణగా ఉంటూ, నన్ను ఎల్లప్పుడూ ముందుకు నడిపిస్తున్న మా అమ్మకు మదర్స్‌డే శుభాకాంక్షలు’ - కాజల్‌

‘మదర్స్‌ డే సందర్భంగా జీవితంలో ఎంతో ముఖ్యమైన వ్యక్తి మా అమ్మకు మనస్ఫూర్తిగా కృజ్ఞతలు తెలుపుతున్నాను. మా డార్లింగ్‌ అమ్మతోపాటు అందరి అమ్మలకు హ్యాపీ మదర్స్‌ డే. ఇది వాళ్ల రోజు కాబట్టి ఈరోజు వాళ్లకి ప్రత్యేకంగా ఉండేలా చేయండి’ - నాగశౌర్య

 
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని