వ్యక్తిగత జీవితంపై దిల్‌రాజు ట్వీట్‌
close
Updated : 10/05/2020 17:10 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

వ్యక్తిగత జీవితంపై దిల్‌రాజు ట్వీట్‌

పునఃప్రారంభించాల్సిన సమయమిది..

హైదరాబాద్‌: గత కొంతకాలం నుంచి తన వ్యక్తిగత జీవితంలో ఎలాంటి సంతోషం లేదని అగ్ర నిర్మాత దిల్‌ రాజు అన్నారు. పర్సనల్‌ లైఫ్‌ను పునఃప్రారంభించడానికి ఇదే సరైన సమయమని ఆయన పేర్కొన్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ ట్విటర్‌ ఖాతా వేదికగా దిల్‌రాజు ఆదివారం ఉదయం ఓ ట్వీట్‌ పెట్టారు. ‘ప్రపంచం మొత్తం ప్రస్తుతం ఉన్న క్లిష్ట పరిస్థితుల్లో మనలోని చాలామంది వృత్తిపరంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత కొంతకాలంగా నా వ్యక్తిగత జీవితంలో ఎలాంటి సంతోషం చోటుచేసుకోలేదు. ఈ క్లిష్ట పరిస్థితులన్నీ త్వరలోనే చెదిరిపోయి మళ్లీ మనం సాధారణ, అందమైన జీవితాల్లోకి అడుగుపెడతామని ఆశిస్తున్నాను. అలాంటి ఆశతోనే నా వ్యక్తిగత జీవితాన్ని పునఃప్రారంభించడానికి ఇది సరైన సమయంగా భావిస్తున్నాను’ అని దిల్‌ రాజు తెలిపారు. మరోపక్క ఆయన రెండో పెళ్లి చేసుకోబోతున్నారని ఇటీవల వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ప్రకటన చేయడం గమనార్హం.

ఈ ఏడాది విడుదలైన ‘జాను’ చిత్రాన్ని దిల్‌రాజు నిర్మించారు. తమిళంలో తెరకెక్కిన ‘96’ చిత్రానికి రీమేక్‌గా ‘జాను’ విడుదలైంది. తమిళంలో త్రిష, విజయ సేతుపతి పోషించిన పాత్రల్లో తెలుగులో సమంత, శర్వానంద్‌ నటించారు. నాని, సుధీర్‌బాబు కథానాయకులుగా రానున్న ‘వి’ చిత్రాన్ని దిల్‌రాజు నిర్మిస్తున్నారు. లాక్‌డౌన్‌ కారణంగా ‘వి’ సినిమా విడుదల కొంతకాలం వాయిదా పడింది. పవన్‌కల్యాణ్‌ ‘వకీల్‌సాబ్’ చిత్రానికి కూడా దిల్‌రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని