తనని కలిసిన రోజును మర్చిపోను 
close
Published : 10/05/2020 21:02 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

తనని కలిసిన రోజును మర్చిపోను 

నా ఆలోచనలు మారాయి: మంచులక్ష్మి

హైదరాబాద్‌: తన గారాలపట్టి, చిట్టితల్లి విద్యాను మొదటిసారి చేతుల్లోకి తీసుకున్న రోజును ఎప్పటికీ మర్చిపోలేనని నటి మంచు లక్ష్మి అన్నారు. కుమార్తెను చూసిన ఆ క్షణం తనకెంతో సంతోషంగా అనిపించిందని.. ఆ ఆనందాన్ని మాటల్లో వర్ణించలేనని లక్ష్మి తెలిపారు. మదర్స్‌ డేను పురస్కరించుకుని ఆదివారం ఓ ఆంగ్ల పత్రిక వారు మంచులక్ష్మితో ప్రత్యేకంగా ముచ్చటించారు. ఇందులో భాగంగా కుమార్తె విద్యాతో తనకి ఎలాంటి అనుబంధం ఉందో లక్ష్మి తెలియచేశారు.

‘పాప పుడుతుందని నేను ఎప్పుడూ అనుకోలేదు. కొన్ని కొన్ని కారణాల వల్ల బాబు పుడతాడనుకున్నాను. పాప పుట్టిన వెంటనే తనని చేతుల్లోకి తీసుకున్న క్షణాన్ని ఎప్పటికీ మర్చిపోలేను. ఆ ఆనందాన్ని మాటల్లో వర్ణించలేను. తను నా జీవితంలోకి రావడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నాను. నా జీవితానికి అందమైన అర్థాన్ని ఇచ్చింది. విద్యా పుట్టక ముందు.. ప్రతి చిన్న విషయంలో.. ఇలా చేద్దామా? అలా చేద్దామా? అని ఆలోచిస్తూ ఉండేదాన్ని. కానీ తను పుట్టిన తర్వాత ప్రతి విషయంలో నేను చాలా క్లియర్‌గా ఉండడం తెలుసుకున్నాను. అందువల్ల నా జీవితం చాలా సంతోషంగా, ప్రశాంతంగా ఉంది. నేను చెప్పిన ప్రతి మాటను నా కుమార్తె వింటుంది. తనే నా ఏంజెల్‌. నా కుమార్తెకు స్నేహితురాలిగా ఉండాలని నేను భావించడం లేదు. కానీ తనకి ప్రతి విషయంలో మంచి, చెడులు నేర్పించే ఓ తల్లిగా ఉండాలనుకుంటున్నాను.’ అని మంచులక్ష్మి తెలిపారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని