ఆ ఘటన నా హృదయాన్ని తాకింది: చిరు
close
Updated : 10/05/2020 20:28 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఆ ఘటన నా హృదయాన్ని తాకింది: చిరు

సుధీర్‌బాబు నోట ఎన్టీఆర్‌ మాట
కరోనాపై బాబూ మోహన్‌ పాట

హైదరాబాద్‌: ఓ పోలీసు అధికారిణిలో మాతృత్వం చూశానని, ఆమె వ్యక్తిత్వం తన హృదయాన్ని తాకిందని అగ్ర కథానాయకుడు చిరంజీవి అన్నారు. ఆయన మాతృ దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు చెబుతూ వీడియోను ట్విటర్‌లో షేర్‌ చేశారు. ‘మన తల్లి గురించి మనం చెప్పుకోవడం గర్వంగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది. అది మామూలే. అయితే ఈసారి మరో తల్లి గురించి మీ ముందు మాట్లాడుతా..’ అంటూ రోడ్డుపక్క మానసిక పరిస్థితి సరిగ్గాలేక ఉన్న వృద్ధురాలికి అన్నం తినిపించిన ఓ పోలీసు అధికారిణి గురించి చిరు చెప్పారు. ఆ అధికారిణితో ప్రత్యేకంగా మాట్లాడానని తెలిపారు. ఆమెతో సంభాషణను మరో వీడియో రూపంలో చెబుతానని పేర్కొన్నారు.

కథానాయకుడు సాయిధరమ్‌ తేజ్ చిన్నతనంలో తల్లితో కలిసి దిగిన ఫొటో షేర్‌ చేశారు. అందులో ఆయన్ను అమ్మాయి గెటప్‌లో రెడీ చేశారు. ప్రముఖ నటుడు బాబు మోహన్‌ కరోనాపై ప్రత్యేక గీతాన్ని రూపొందించారు. ‘రామలింగో రామలింగా..’ అంటూ సాగే ఈ గీతాన్ని ఆదివారం విడుదల చేశారు. హీరో సుధీర్‌బాబు ఎన్టీఆర్‌ డైలాగ్‌తో అదరగొట్టారు. ఇలా మన తారలు ఈ లాక్‌డౌన్‌లో సోషల్‌మీడియాలో షేర్‌ చేసిన ఆసక్తికర పోస్ట్‌లు చూద్దాం..














మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని