నా పిల్లలకు కాబోయే తల్లి నయనతార!
close
Published : 11/05/2020 17:18 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

నా పిల్లలకు కాబోయే తల్లి నయనతార!

విఘ్నేశ్‌ శివన్‌ పోస్ట్‌

చెన్నై: మాతృ దినోత్సవం సందర్భంగా తమిళ దర్శకుడు విఘ్నేశ్‌ శివన్‌ తన ప్రేయసి నయనతారకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు చెప్పారు. లేడీ సూపర్‌స్టార్‌ ఓ బాబును ఎత్తుకుని ఉన్న చక్కటి ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు. ‘నా పిల్లలకు కాబోయే తల్లికి మాతృ దినోత్సవ శుభాకాంక్షలు’ అని పేర్కొన్నారు. ఆయన మాటలు అందరి దృష్టిని ఆకర్షించాయి. నయన్‌ ఫొటో సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతోంది. అది విహారయాత్ర కోసం విదేశాలకు వెళ్లినప్పుడు తీసిన ఫొటోగా తెలుస్తోంది. త్వరలోనే వీరి పెళ్లి జరిగే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇదే సందర్భంగా నయన్‌ తల్లి డయనా కురియన్‌ను కూడా విఘ్నేశ్‌ విష్‌ చేశారు. అందమైన అమ్మాయికి జన్మనిచ్చి, గొప్ప పని చేశారని అన్నారు. నయన్‌ తన తల్లితో దిగిన పలు ఫొటోల్ని షేర్‌ చేశారు.

2015లో ‘నేనూ రౌడీనే..’ చిత్రం ద్వారా నయన్‌, విఘ్నేశ్‌కు మధ్య పరిచయం ఏర్పడింది. ఈ సినిమాకు విఘ్నేశ్‌ దర్శకత్వం వహించగా.. నయన్‌ కథానాయికగా నటించారు. ఆ పరిచయం కాస్తా స్నేహానికి దారి తీసి, ప్రేమగా మారింది. వీరిద్దరు అనేక మార్లు విహారయాత్రలకు కలిసి వెళ్లారు. విఘ్నేశ్‌ పలు సందర్భాల్లో నటిపై ప్రేమను తెలిపారు. నయన్‌ ఇటీవల ‘బిగిల్‌’, ‘దర్బార్‌’ సినిమాలతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. మరోపక్క విఘ్నేశ్‌-నయన్ కాంబినేషన్‌లో ‘నెట్రికన్‌’ అనే థ్రిల్లర్ చిత్రం‌ రూపొందుతోంది. 

 




మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని