నా లవ్‌లైఫ్‌ను ఇంకా కలవలేదు: త్రిష
close
Published : 14/05/2020 15:54 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

నా లవ్‌లైఫ్‌ను ఇంకా కలవలేదు: త్రిష

స్వచ్ఛమైన ప్రేమ ఉందని నమ్ముతున్నాను

హైదరాబాద్‌: తన లవ్‌లైఫ్‌ను ఇంకా కలవలేదని అగ్రకథానాయిక త్రిష అన్నారు. లాక్‌డౌన్‌ కారణంగా షూటింగ్స్‌ నుంచి కొంత విశ్రాంతి దొరకడంతో సోషల్‌మీడియా వేదికగా త్రిష తన అభిమానులకు చేరువగా ఉంటున్నారు. ఇటీవల టిక్‌టాక్‌లోకి అడుగుపెట్టిన ఆమె పలు డ్యాన్స్‌ వీడియోలతో మెప్పిస్తూనే.. మరోవైపు ఇన్‌స్టాలో మధుర జ్ఞాపకాలతో నెటిజన్ల హృదయాలను హత్తుకుంటున్నారు. ఇదిలా ఉండగా తాజాగా త్రిష ఇన్‌స్టా వేదికగా నెటిజన్లతో కొంతసమయం ముచ్చటించారు. అభిమానులు అడిగిన పలు ప్రశ్నలకు  సమాధానాలు కూడా ఇచ్చారు. అంతేకాకుండా పలువురు నెటిజన్లకు వర్కౌట్ల విషయంలో కొన్ని సూచనలు కూడా చేశారు.

కాగా, ఓ నెటిజన్‌.. ‘త్రిష..మీ లవ్‌లైఫ్‌ను కలిశారా?’ అని అడగగా.. ‘ఇప్పటివరకూ మేమిద్దరం ఇంకా కలుసుకోలేదు’ అని త్రిష సమాధానం తెలిపారు. అనంతరం మరో నెటిజన్‌.. ‘నిజమైన, స్వచ్ఛమైన ప్రేమ ఉందని మీరు నమ్ముతారా?’ అని ప్రశ్నించగా.. ‘స్వచ్ఛమైన ప్రేమ ఉందని నేను నిజంగానే నమ్ముతున్నాను. ప్రేమ అనేది లేకపోతే జీవించలేం. జీవితంలో అనుకున్నది సాధించాలంటే ప్రేమ అనేది కావాలి’ అని త్రిష తెలిపారు. మరో అభిమాని అడిగిన ప్రశ్నకు సమాధానంగా.. తన దృష్టిలో కమల్‌హాసన్‌, మోహన్‌లాల్‌, అమీర్‌ఖాన్‌ ఉత్తమ నటులని పేర్కొన్నారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని