టీ-టౌన్‌లో మరో వికెట్‌ డౌన్‌..!
close
Published : 14/05/2020 21:09 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

టీ-టౌన్‌లో మరో వికెట్‌ డౌన్‌..!

నిఖిల్‌ పెళ్లి గురించి సాయితేజ్‌ ట్వీట్‌

హైదరాబాద్‌: యువ కథానాయకుడు నిఖిల్‌ పెళ్లిని ఉద్దేశిస్తూ మరో యువ హీరో సాయిధరమ్‌ తేజ్‌ ఓ ట్వీట్‌ పెట్టారు. టాలీవుడ్‌ టౌన్‌లో మరో వికెట్‌ డౌన్‌ అయ్యిందని ఆయన పేర్కొన్నారు. గత కొంతకాలం నుంచి ప్రేమలో ఉన్న నిఖిల్‌, పల్లవి గురువారం ఉదయం వివాహబంధంతో ఒక్కటైన విషయం తెలిసిందే. ఏప్రిల్‌ 16న జరగాల్సిన నిఖిల్‌- పల్లవి వివాహం లాక్‌డౌన్‌ కారణంగా కొంతకాలంపాటు వాయిదా వేశారు. పరిస్థితులు చక్కబడిన తర్వాత పెళ్లి చేసుకుందామని నిఖిల్‌ భావించినప్పటికీ మళ్లీ ఇప్పుడప్పుడే ముహూర్తాలు లేకపోవడంతో వధూవరుల జాతకాల రీత్యా ఈ రోజు ఉదయం ఇరు కుటుంబాల పెద్దలు వివాహం జరిపించారు. దీంతో అతి తక్కువ మంది కుటుంబసభ్యుల సమక్షంలో నిఖిల్‌ వివాహం వేడుకగా జరిగింది.

కాగా, వివాహానంతరం పెళ్లికి సంబంధించిన ఓ ఫొటోను ట్విటర్‌ వేదికగా షేర్‌ చేసిన నిఖిల్‌.. ‘పెళ్లి.. ఇప్పుడే జరిగింది’ అని ట్వీట్‌ చేశారు. ఇదిలా ఉండగా నిఖిల్‌కు శుభాకాంక్షలు తెలుపుతూ పలువురు సినీ సెలబ్రిటీలు, అభిమానులు ట్వీట్లు పెట్టారు. మరోవైపు నిఖిల్‌ పెళ్లి ఫొటోను షేర్‌ చేసిన సాయి తేజ్‌.. ‘టీ-టౌన్‌లో మరో వికెట్‌ డౌన్‌. నిఖిల్‌.. జీవితంలోనే అతిపెద్ద నిర్ణయం తీసుకుని వివాహబంధంలోకి అడుగుపెట్టిన నీకు కంగ్రాట్స్‌. నీకు మరెన్నో హ్యాపీడేస్‌ రావాలని కోరుకుంటున్నాను. నీ ప్రతిరోజూ మరెంతో స్పెషల్‌, ఫన్‌గా ఉండాలని ఆశిస్తున్నాను’ అని ట్వీట్‌ చేశారు. అయితే సాయిధరమ్‌ తేజ్‌ పెట్టిన ట్వీట్‌పై నటుడు బ్రహ్మాజీ స్పందిస్తూ.. ‘ఎంజాయ్‌ చేస్తున్నావా తేజూ.. వికెట్స్‌ పడిపోతుంటే’ అని సరదాగా ప్రశ్నించారు. ‘లేదు.. భయమేస్తుంది బాజీ’ అని సాయితేజ్‌ రిప్లై ఇచ్చారు.

ఇదీ చదవండి

మూడు ముళ్ల బంధంతో ఒక్కటైన నిఖిల్‌-పల్లవి 


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని