‘వకీల్‌ సాబ్’‌ విడుదల‌పై ఫ్యాన్స్‌ మీమ్స్‌
close
Published : 15/05/2020 14:11 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘వకీల్‌ సాబ్’‌ విడుదల‌పై ఫ్యాన్స్‌ మీమ్స్‌

హైదరాబాద్‌: పవర్‌స్టార్‌ పవన్‌ కల్యాణ్‌.. సిల్వర్‌ స్ర్కీన్‌పై ఈ పేరు చూడడం కోసం దాదాపు రెండేళ్లుగా అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు. త్రివిక్రమ్‌ దర్శకత్వం వహించిన ‘అజ్ఞాతవాసి’ చిత్రంలో నటించిన పవన్‌ కల్యాణ్‌.. ఆ తర్వాత రాజకీయాలపై దృష్టి సారించి వెండితెరకు కొంతకాలంపాటు దూరంగా ఉన్నారు. అయితే ఆయన ‘వకీల్‌ సాబ్‌’ చిత్రంతో వెండితెరపై మరోసారి సందడి చేయనున్నారనే మాట విని అభిమానులు ఎంతో సంతోషించారు. అంతేకాదు పవన్‌ కెరీర్‌లోనే బ్లాక్‌బస్టర్‌ హిట్‌గా నిలిచిన ‘గబ్బర్‌సింగ్‌’ విడుదలైన నెలలోనే ‘వకీల్‌సాబ్‌’ కూడా వస్తుందని తెలిసి ఆనందించారు.

కానీ, కరోనా వైరస్‌ వల్ల పరిస్థితులు తారుమారు అయ్యాయి. కరోనా వైరస్‌ విజృంభణతో దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ విధించడంతో సినిమా షూటింగ్స్‌ ఆగిపోయాయి. సినిమా రిలీజ్‌లు కూడా వాయిదా పడ్డాయి. అలా మే 15న ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ‘వకీల్‌ సాబ్‌’ చిత్రానికి బ్రేక్‌ పడింది. దీంతో పవన్‌ అభిమానులు నిరాశకు గురయ్యారు. సోషల్‌మీడియా వేదికగా పలు మీమ్స్‌తో తమ బాధను వ్యక్తం చేస్తున్నారు. ‘కరోనా.. నువ్వు లేకపోతే ఈ రోజు థియేటర్‌లో సందడి చేసేవాళ్లం’, ‘స్ర్కీన్‌పై పవన్‌ పేరు చూసి ఎన్నాళ్లయ్యిందో’, ‘రాజు గారు.. ప్రస్తుతానికి రిలీజ్‌ ఎలాగో లేదు.. కాబట్టి మాకోసం టీజరైనా ఇవ్వండి’ అని ట్వీట్లు చేస్తున్నారు.

అమితాబ్‌ బచ్చన్‌, తాప్సీ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన బాలీవుడ్‌ చిత్రం ‘పింక్‌’. ఈ చిత్రానికి రీమేక్‌గానే ‘వకీల్‌ సాబ్‌’ను రూపొందిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని బోనీ కపూర్‌, దిల్‌రాజు, శిరీష్‌ నిర్మిస్తున్నారు. తమన్‌ స్వరాలు అందిస్తున్నారు. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఇటీవల విడుదలైన ఈ సినిమాలోని ‘మగువా మగువా’ అనే పాట ప్రేక్షకులను ఎంతగానో మెప్పించింది.

 
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని