ప్రభాస్‌తో కలిసి నటించడం సంతోషంగా భావిస్తున్నా..
close
Updated : 17/05/2020 11:21 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ప్రభాస్‌తో కలిసి నటించడం సంతోషంగా భావిస్తున్నా..

భాగ్యశ్రీ

హైదరాబాద్‌: ప్రభాస్‌ కథానాయకుడిగా రాధాకృష్ణ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. పూజాహెగ్డే కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో భాగ్యశ్రీ ఓ కీలకపాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రానికి ‘జాన్‌’ అనే పేరు ప్రచారంలో ఉంది. యూవీ క్రియేషన్స్‌ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ సినిమా బడ్జెట్‌ విషయంలో నిర్మాతలు ఎక్కడా వెనకాడట్లేదని అలనాటి తార భాగ్యశ్రీ అన్నారు. ఇటీవల విదేశాల్లో జరిగిన షెడ్యూల్‌లో పాల్గొన్న భాగ్యశ్రీ ప్రస్తుతం లాక్‌డౌన్‌ కారణంగా షూటింగ్‌ నుంచి ఖాళీ దొరకడంతో తన పాత్ర కోసం అన్నివిధాలుగా సిద్ధమవుతున్నారు.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో ప్రభాస్‌ సినిమా గురించి ఆమె మాట్లాడారు. ‘రాధాకృష్ణ కుమార్‌ దర్శకత్వంలో ప్రభాస్‌ కథానాయకుడిగా తెరకెక్కుతున్న చిత్రంలో నేను నటిస్తున్నాను. 1970 నాటి వింటేజ్‌ లవ్‌ స్టోరీ ఇది. ఈ సినిమాలో నేను చేస్తున్న పాత్ర కోసం అనుభవం ఉన్న వాళ్లని తీసుకోవాలని డైరెక్టర్‌ అనుకున్నారు. ఇందులో నా పాత్ర చాలా విభిన్నంగా ఉంటుంది. ప్రేక్షకులకు చేరువయ్యేలా చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమాని భారీ చిత్రంగా తెరకెక్కించేందుకుగాను బడ్జెట్‌ విషయంలో నిర్మాతలు విక్రమ్‌ రెడ్డి, వంశీ కృష్ణా రెడ్డి, ప్రమోద్‌ ఉప్పలపాటి ఎక్కడా వెనకాడట్లేదు. సినిమాటోగ్రాఫర్‌ మనోజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాలి ఎందుకంటే.. ఆయన చాలా అద్భుతంగా సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఇలాంటి టాలెంట్ ఉన్న బృందంతో కలిసి పనిచేయడం నాకెంతో సంతోషంగా ఉంది. ఇటీవల జార్జియాలో జరిగిన షూటింగ్‌లో నేను పాల్గొన్నాను. ప్రభాస్‌, ఇతర చిత్రబృందం ఇండియాకు రావడానికి వారం ముందే షెడ్యూల్ పూర్తి చేసుకుని ఇక్కడికి వచ్చాను’ అని భాగ్యశ్రీ వివరించారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని