దొంగతనం చేశా.. మహిళ వెంటపడింది: రష్మిక
close
Updated : 19/05/2020 12:02 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

దొంగతనం చేశా.. మహిళ వెంటపడింది: రష్మిక

హైదరాబాద్‌: చిన్నతనంలో మామిడి కాయలు దొంగతనం చేశానని కథానాయిక రష్మిక చెప్పారు. ఈ అల్లరి పిల్ల చెట్టు ఎక్కి కాయలు కోస్తుండగా యజమాని చూసి వెంటపడిందట. తాజాగా రష్మిక ట్విటర్‌ వేదికగా అభిమానులతో ముచ్చటించారు. రొటీన్‌ ప్రశ్నలు అడగొద్దని, నటన గురించి ప్రశ్నించొద్దని ముందే ఫాలోవర్స్‌కు చెప్పారు. #UntoldRashmika ట్యాగ్‌ను జత చేశారు. ఈ సందర్భంగా ఓ నెటిజన్‌ చిన్నతనంలో జరిగిన సరదా ఘటన గురించి చెప్పమని అడిగారు. ‘నేను, నా స్నేహితురాలు ట్యూషన్‌కు వెళ్తుండగా మార్గ మధ్యంలో మామిడి చెట్టు కనిపించింది. నేను చెట్టు ఎక్కా, అక్కడ ఉన్న ఆంటీ మమ్మల్ని చూసేసింది. చేతిలో కర్రపట్టుకుని మా వెంట పరిగెత్తింది. మమ్మల్ని తిడుతూ వెంబడించింది. అదే నా బాల్యంలోని ఫన్నీ ఘటన. ఇది అందరి బాల్యంలో ఉండే కథే’ అని రష్మిక రిప్లై ఇచ్చారు.

‘మీరు థియేటర్‌లో చూసిన మొదటి సినిమా ఏది?’ అని అడగగా.. ‘‘గిల్లి’ అనుకుంటా. మా నాన్న తీసుకెళ్లారు. ఒకప్పుడు ఆయనకు సినిమాలంటే చాలా ఇష్టం. కానీ నేను నటైన తర్వాత మారిపోయారు’ అని ఆమె అన్నారు.

‘మీ అమ్మ చివరగా మీకెప్పుడు ఫుడ్‌ తినిపించారు?’ అని ఓ నెటిజన్‌ ప్రశ్నించారు. ‘ప్రతి రోజు ఆమె ఫ్రూట్స్‌ కట్‌ చేసి తీసుకొస్తుంది. నాకొద్దని ప్రతి సారి చెబుతుంటా. కానీ ఆమె తినిపిస్తుంటే.. ఏమీ మాట్లాడకుండా తింటా. కాబట్టి ఇవాళే’ అని రష్మిక పేర్కొన్నారు. ‘మీకిష్టమైన ఆట ఏది, ఇష్టమైన క్రీడాకారుడు ఎవరు?’ అని ఓ వ్యక్తి అడిగారు. ‘నాకు బ్యాడ్మింటన్‌, క్రికెట్‌, ఈత కొట్టడం ఇష్టం. నాకు ప్రతి క్రీడాకారుడిపై గౌరవం ఉంది. ఒకరి పేరు మాత్రమే ఎంచుకోలేను’ అని చెప్పారు.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని