అరుదైన వ్యాధితో బాధపడ్డా: సుస్మితా సేన్‌
close
Updated : 18/05/2020 12:59 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అరుదైన వ్యాధితో బాధపడ్డా: సుస్మితా సేన్‌

తన ఆరోగ్య పరిస్థితి గురించి వీడియో షేర్‌ చేసిన నటి 

ముంబయి: ఒకానొక సమయంలో తాను ఓ అరుదైన వ్యాధితో తీవ్రమైన పోరాటం చేశానని మాజీ విశ్వ సుందరి సుస్మితా సేన్‌ అన్నారు. తన వర్కౌట్లకు సంబంధించిన వీడియోలతో తరచూ నెటిజన్లను ఆకట్టుకునే సుస్మితా తాజాగా ఒకప్పటి తన ఆరోగ్య పరిస్థితి గురించి తెలియజేస్తూ ఓ వీడియో షేర్‌ చేశారు. నాన్‌చాకు ప్రాక్టీస్‌ వల్ల తాను ఆరోగ్యవంతమైన మహిళగా మారానని తెలిపారు. మన శరీరం గురించి మనకంటే ఎక్కువగా ఎవరికీ తెలియదని.. కాబట్టి ఆరోగ్యంగా ఉండాలంటే దాని మాట వినాలని ఆమె సూచించారు.

‘2014 సెప్టెంబర్‌లో నేను అడిసన్‌ వ్యాధితో ఇబ్బంది పడ్డాను. దానివల్ల నాలో రోగ నిరోధకశక్తి పూర్తిగా దెబ్బతింది. వ్యాధితో పోరాటం చేయడానికి కూడా శక్తి లేదనుకునేదాన్ని. శరీరం పూర్తిగా నీరసించిపోయింది. ఆ సమయంలో నా కంటి చుట్టూ నల్లని వలయాలు వచ్చాయి. నా జీవితంలో అలాంటి చీకటి రోజుల్లో నాలుగేళ్లు ఎలా పోరాటం చేశానో మాటల్లో చెప్పలేను. వ్యాధి నుంచి బయటపడడం కోసం ఉత్ప్రేరకాలను తీసుకున్నాను. వాటివల్ల సైడ్‌ ఎఫెక్ట్స్‌ వచ్చాయి. అనారోగ్యంతోనే జీవించాలమో అనిపించింది. అలాంటి సమయంలో నన్ను నేను రీబిల్డ్‌ చేసుకోవాలనుకున్నాను. నా ఆలోచనలను బలోపేతం చేసుకున్నాను. ఆరోగ్యవంతంగా మారడానికి సరైన మార్గాన్ని ఎంచుకున్నాను. ‘నాన్‌చాకు’ సాధన చేశాను. కోలుకున్నాను. ఎలాంటి ఉత్ప్రేరకాలు లేకుండా 2019 నాటికి నేను మళ్లీ మామూలు స్థితికి వచ్చేశాను’ అని సుస్మితా తెలిపారు.Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని