బాలయ్య చాలా పాజిటివ్‌: ఛార్మి‌
close
Published : 19/05/2020 11:21 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

బాలయ్య చాలా పాజిటివ్‌: ఛార్మి‌

హైదరాబాద్‌: అగ్ర కథానాయకుడు నందమూరి బాలకృష్ణతో దర్శకుడు పూరీ జగన్నాథ్‌ భవిష్యత్తులో సినిమా తీస్తారని నటి, నిర్మాత ఛార్మి అన్నారు. ఆమె తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌ లైవ్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పూరీ తర్వాతి సినిమాలు ‘ఫైటర్‌’, ‘రొమాంటిక్‌’ గురించి ముచ్చటించారు. అనంతరం బాలయ్య గురించి స్పందిస్తూ.. ‘ఆయన చాలా పాజిటివ్‌గా ఉండే వ్యక్తి. ఆయనతో సినిమా తీయడానికి పూరీ ఎప్పుడూ సిద్ధంగానే ఉంటారు. వారిద్దరి మధ్య అంత మంచి బంధం ఉంది. బాలయ్య సినిమా అంటే మంచి కథ కావాలి. సరైన స్క్రిప్టు కుదిరినప్పుడు ఇద్దరూ కలిసి సినిమా తీస్తారు’ అని చెప్పారు. గత కొన్నేళ్లుగా నటనకు దూరంగా ఉన్న ఛార్మి నిర్మాతగా మారి పలు సినిమాలు నిర్మించారు. ‘రోగ్‌’, ‘పైసా వసూల్‌’, ‘మెహబూబా’, ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాలకు సహ నిర్మాతగా వ్యవహరించారు.

పూరీ-బాలయ్య ఇప్పటికే ‘పైసా వసూల్‌’ సినిమా కోసం పనిచేసిన సంగతి తెలిసిందే. భవ్య క్రియేషన్స్‌ నిర్మించిన ఈ సినిమా మాస్‌ ప్రేక్షకుల్ని అలరించింది. ‘రూలర్‌’ తర్వాత బాలయ్య తన 106వ సినిమాలో నటిస్తున్నారు. బోయపాటి శ్రీను దర్శకుడు. ఈ చిత్రంలో ఆయన రెండు విభిన్నమైన పాత్రల్లో కనిపించబోతున్నారట. ఇందులో విలన్‌గా నటి భూమికను తీసుకోవడానికి దర్శక, నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం చర్చల దశలో ఉన్నట్లు తెలుస్తోంది. కరోనా కారణంగా ఈ చిత్రం షూటింగ్‌ వాయిదా పడింది.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని