‘వన్‌ అండ్‌ ఓన్లీ పీస్‌ ఇన్‌ ది వరల్డ్‌..!’
close
Published : 20/05/2020 14:07 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘వన్‌ అండ్‌ ఓన్లీ పీస్‌ ఇన్‌ ది వరల్డ్‌..!’

యంగ్‌ టైగర్‌కు శుభాకాంక్షల వెల్లువ..

హైదరాబాద్‌: బాలనటుడిగా ఒదిగిపోయి.. హీరోయిజానికి నిలువెత్తు నిదర్శనంగా ఎదిగి ఎందరో అభిమానులను సొంతం చేసుకున్నారు అగ్రకథానాయకుడు యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌. నటనపట్ల తనకున్న అమితమైన ప్రేమ, అంకితభావంతో ఎందరో యువ నటులకు స్ఫూర్తిగా మారారు. బుధవారం ఎన్టీఆర్‌ పుట్టినరోజు పురస్కరించుకుని అభిమానులతోపాటు పలువురు సినీ ప్రముఖులు సోషల్‌మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. దీంతో ఎన్టీఆర్‌కు సంబంధించిన పలు ఫొటోలు, వీడియోలు నెట్టింట్లో సందడి చేస్తున్నాయి.

మరోవైపు ఎన్టీఆర్‌ వ్యాఖ్యాతగా బుల్లితెర ప్రేక్షకులను అలరించిన గేమ్‌ షో ‘బిగ్‌బాస్‌ సీజన్‌1’. ఎన్టీఆర్‌ పుట్టినరోజును పురస్కరించుకుని ఈ సీజన్లో పాల్గొన్న కంటిస్టెంట్స్‌ అందరూ కలిసి ఓ ప్రత్యేక వీడియో రూపొందించారు. ఎన్టీఆర్‌తో తమకున్న అనుబంధాన్ని షేర్‌ చేసుకున్నారు. ఇదిలా ఉండగా దేవిశ్రీ ప్రసాద్‌ సైతం తారక్‌కు స్పెషల్‌ సాంగ్‌తో బర్త్‌డే సర్‌ప్రైజ్‌ ఇచ్చారు.

‘మా తారక్‌కి జన్మదిన శుభాకాంక్షలు. అద్భుతమైన నటన, అభినయంతో తెలుగు ప్రేక్షకాభిమానుల్ని రెండు దశాబ్దాలుగా అలరిస్తూనే ఉన్నావు. #RRR చిత్రంతో కొమరంభీమ్‌గా భారతదేశం మొత్తం నీ ఖ్యాతి మారుమోగాలని ఆశిస్తున్నాను.’ - రాఘవేంద్రరావు

‘మా కొమరంభీమ్‌ తారక్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆన్‌స్ర్కీన్‌, ఆఫ్‌స్ర్కీన్‌పై మీ ఎనర్జీ చూసి మన బృందం మొత్తం ఎంతో సంతోషించింది. మీతో కలిసి సృష్టించిన అద్భుతాన్ని ప్రపంచానికి చూపించడానికి మేమెంతో ఆతృతగా ఎదురుచూస్తున్నాం’ - ఆర్‌ఆర్‌ఆర్‌ టీమ్‌

‘సినీ రంగంలో నా ప్రయాణం ప్రారంభమైన నాటి నుంచి అందులో నువ్వు భాగమైనందుకు ఎంతో సంతోషిస్తున్నాను. హ్యాపీ బర్త్‌డే తారక్‌. నీకంటే గొప్ప ‘భీమ్‌’ నాకు దొరకలేదు’ - రాజమౌళి

‘హ్యాపీ బర్త్‌డే మై బ్రదర్‌ తారక్‌. నీకు ఓ రిటర్న్‌ గిఫ్ట్‌ బాకీ ఉన్నాను. కానీ నీకు బెస్ట్‌ గిఫ్ట్‌నే ఇస్తానని మాటిస్తున్నాను. ముందు ముందు ఎన్నో సెల్రబేషన్స్‌ జరగనున్నాయి’ - రామ్‌ చరణ్‌

‘పవర్‌హౌస్‌ ఆఫ్‌ పెర్ఫామెన్స్‌ ఎన్టీఆర్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు. పాత్రకోసం మీరు మారిన తీరు మైండ్‌బ్లోయింగ్‌’ - మారుతీ

‘వన్‌ అండ్‌ ఓన్లీ పీస్‌ ఇన్‌ ది వరల్డ్‌!! తారక్‌కు జన్మదిన శుభాకాంక్షలు. మీరు ఇలాగే ఉన్నత శిఖరాలకు ఎదగాలని, మరెంతో మందికి స్ఫూర్తిగా నిలవాలని కోరుకుంటున్నా’ - సంపత్‌ నంది

‘తెలుగు సినీ పరిశ్రమలో ఉత్తమ నటుల్లో ఒకరైన ఎన్టీఆర్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు. మీ కలలు నేరవేరాలని ఆశిస్తున్నాను’ - సాయిధరమ్‌ తేజ్‌

‘ఓ గొప్ప నటుడు, అద్భుతమైన డ్యాన్సర్‌.. మేము తెరకెక్కించిన ‘బాలరామాయణం’ చిత్రంలో రాముడిగా నటించిన మా తారక్‌కు జన్మదిన శుభాకాంక్షలు. మీకు మరిన్ని బ్లాక్‌బస్టర్స్‌ సొంతం కావాలని ఆశిస్తున్నాను’ - గుణా టీమ్‌ వర్క్స్‌ మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని