కమల్‌ భారత్‌ నుంచి నాకు ఈ బహుమతి తెచ్చారు!
close
Published : 20/05/2020 22:08 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కమల్‌ భారత్‌ నుంచి నాకు ఈ బహుమతి తెచ్చారు!

హాలీవుడ్‌ నటి

లాస్‌ ఏంజెల్స్‌: విలక్షణ నటుడు కమల్‌ హాసన్‌ తనకు భారత్‌ నుంచి ప్రత్యేకమైన కానుక తెచ్చి ఇచ్చారని ఆస్కార్‌ అవార్డు అందుకున్న మేకప్‌ ఆర్టిస్టు మైఖెల్‌ వెస్ట్‌మోర్‌ కుమార్తె, అమెరికా నటి మెకెంజీ వెస్ట్‌మోర్‌ తెలిపారు. ఆమె తాజాగా కమల్‌ను ఉద్దేశిస్తూ ట్విటర్‌లో మాట్లాడారు. తను బాల్యంలో ఉన్నప్పుడు కమల్‌ ఇంటికి వచ్చారని, తన తండ్రి దగ్గర మేకప్‌లో మెలకువలు నేర్చుకున్నారని చెప్పారు. ‘‘కమల్‌ హాసన్‌ మీకు తెలుసా?’ అని ఇప్పటికే చాలా మంది నన్ను అడిగారు. దానికి సమాధానం ఇప్పుడు చెబుతున్నా. నా చిన్నతనంలో కమల్‌ మేకప్‌ లుక్స్‌ను నాన్న క్రియేట్‌ చేసేవారు. ఆ తర్వాత కూడా మేం అప్పుడప్పుడూ మాట్లాడుకుంటూ ఉండేవాళ్లం. కొన్నేళ్ల క్రితం నేను కమల్‌ను చూశా. అప్పుడు తీసుకున్న ఫొటో ఇది. రెండో ఫొటోలో ఉన్నది నేను, నాన్న. కమల్‌ నాకు బహుమతిగా భారత్‌ నుంచి ఆ డ్రస్‌ తెచ్చారు’ అని లవ్‌ సింబల్‌ను పోస్ట్‌ చేశారు.

మెకెంజీ చేసిన పోస్ట్‌కు తెగ కామెంట్లు వచ్చాయి. ‘కమల్‌ ఎవరో తెలియదు. కానీ నువ్వు ఇంకా ఆయన్ను గుర్తుపెట్టుకోవడం గొప్ప విషయం’ అని ఓ నెటిజన్‌ పోస్ట్‌ చేశారు. దీనికి మెకెంజీ రిప్లై ఇచ్చారు. ‘భారత చిత్ర పరిశ్రమలో ఆయన అగ్ర కథానాయకుడు. ఓ అమెరికన్‌ నటుడి కంటే ఎంతో గొప్ప’ అని జవాబిచ్చారు. మరో నెటిజన్‌ స్పందిస్తూ.. ‘ఆయన సినిమాలో మీకు నటించే అవకాశం వస్తుందని ఆశిస్తున్నా’ అని పేర్కొన్నారు. ‘అది నా డ్రీమ్..’ అని మెకెంజీ సమాధానం ఇచ్చారు.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని