రెండు బస్సులు ఏర్పాటు చేసిన మనోజ్‌
close
Updated : 20/05/2020 20:08 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రెండు బస్సులు ఏర్పాటు చేసిన మనోజ్‌

హైదరాబాద్‌: వలస కార్మికుల కష్టాలు తీర్చేందుకు యువ కథానాయకుడు మంచు మనోజ్‌ ముందుకొచ్చారు. తన వంతు సాయంగా వారి కోసం బస్సులు ఏర్పాటు చేశారు. హైదరాబాద్‌ నుంచి శ్రీకాకుళం వెళ్లేందుకు రెండు బస్సులు ఏర్పాటు చేశారు. వారికి ఆహారంతో పాటు మాస్కులు, శానిటైజర్లు స్వయంగా అందజేశారు. కొబ్బరికాయ కొట్టి బస్సులు ప్రారంభించారు. బస్సుల్లో వారిని తరలించేందుకు సంబంధించిన అనుమతులు కేంద్రం నుంచి తెచ్చుకున్నట్లు మనోజ్‌ తెలిపారు. రానున్న రోజుల్లో ఈ సేవల్ని మరింత విస్తృతం చేయాలని భావిస్తున్నానని మనోజ్‌ చెప్పారు.

మనోజ్‌ బుధవారం తన పుట్టినరోజు జరుపుకొంటున్న సంగతి తెలిసిందే. దాదాపు మూడేళ్ల విరామం తర్వాత ఆయన‌ ‘అహం బ్రహ్మాస్మి’ సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి శ్రీకాంత్‌ ఎన్‌. రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ఎమ్‌ఎమ్‌ ఆర్ట్స్‌ సంస్థ నిర్మిస్తున్న చిత్రాన్ని విద్యా నిర్వాణ మంచు ఆనంద్‌ సమర్పిస్తున్నారు. మనోజ్‌ 2017లో ‘ఒక్కడు మిగిలాడు’ సినిమాలో చివరిసారి వెండితెరపై కనిపించారు. ఆపై సినిమాలకు దూరంగా ఉండబోతున్నట్లు చెప్పారు. తిరిగి ఇప్పుడు మళ్లీ మేకప్‌ వేసుకోబోతున్నారు. లాక్‌డౌన్‌ కారణంగా ఈ సినిమా షూటింగ్‌ వాయిదా పడింది.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని