ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలను?: ఎన్టీఆర్‌
close
Published : 20/05/2020 18:37 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలను?: ఎన్టీఆర్‌

హైదరాబాద్‌: తనపై అమితమైన ప్రేమ కురిపిస్తున్న అభిమానులకు జీవితాంతం రుణపడి ఉంటానని కథానాయకుడు ఎన్టీఆర్‌ పేర్కొన్నారు. ఆయన బుధవారం తన 37వ పుట్టినరోజును జరుపుకొంటున్నారు. ఈ సందర్భంగా సినీ ప్రముఖులతోపాటు అభిమానులు సోషల్‌మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. కె. రాఘవేంద్రరావు, చిరంజీవి, ఎస్‌.ఎస్‌. రాజమౌళి, రామ్‌చరణ్‌, రకుల్‌ప్రీత్‌ సింగ్‌, కాజల్‌ తదితరులు విష్‌ చేసిన వారిలో ఉన్నారు. #HappyBirthdayTarak అనే ట్యాగ్‌ ట్విటర్‌లో దేశవ్యాప్తంగా ట్రెండ్‌ అయ్యింది. 3 లక్షల మందికిపైగా ఈ ట్యాగ్‌ను ఉపయోగించి ట్వీట్‌ చేశారు. ఈ సందర్భంగా తారక్‌ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ భావోద్వేగంతో ట్వీట్‌ చేశారు.

‘మీరు నా మీద చూపిస్తున్న అభిమానం వెలకట్టలేనిది. అన్నింటా నాకు తోడుగా వస్తున్న మీరే నా బలం. ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలను? ఏం చేసి ఈ ప్రేమకు అర్హుడిని అవగలను? చివరి దాకా మీకు తోడుగా ఉండటం తప్ప..’ అని ఆయన పోస్ట్‌ చేశారు. తనకు శుభాకాంక్షలు చెప్పిన తోటి నటీనటులకు, శ్రేయోభిలాషులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ట్వీట్లన్నీ చదివానని, తన పుట్టినరోజును ప్రత్యేకం చేశారని పేర్కొన్నారు.

తారక్‌ ప్రస్తుతం ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’ సినిమాలో నటిస్తున్నారు. దాదాపు రూ.400 కోట్ల బడ్జెట్‌తో రూపొందిస్తున్న ఈ సినిమాకు ఎస్‌.ఎస్‌. రాజమౌళి దర్శకత్వం వహిస్తున్నారు. రామ్‌ చరణ్‌ మరో కథానాయకుడు. దానయ్య నిర్మాత. ఈ సినిమా కోసం చెర్రీ, తారక్‌ మరింత ఫిట్‌గా తయారయ్యారు. వచ్చే ఏడాది ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని