నాకొక మంచి పేరు చెప్పండి..?
close
Updated : 21/05/2020 09:55 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

నాకొక మంచి పేరు చెప్పండి..?

అభిమానులను కోరిన రష్మిక

హైదరాబాద్‌: తనకి ఏ పేరు సూట్‌ అవుతుందో చెప్పమని క్యూటీ బ్యూటీ రష్మిక నెటిజన్లను సరదాగా కోరారు. సోషల్‌మీడియా వేదికగా తరచూ అభిమానులతో చేరువగా ఉండే రష్మిక లాక్‌డౌన్‌ ప్రారంభమైన నాటి నుంచి తనకు సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకుంటూ నెట్టింట్లో సందడి చేస్తున్నారు. ఇటీవల #UntoldRashmika పేరుతో తన లైఫ్‌లో జరిగిన ఎన్నో సరదా సంగతులను ఆమె అభిమానులతో పంచుకున్న విషయం తెలిసిందే. తాజాగా రష్మిక నెటిజన్లకు సరదా ప్రశ్న విసిరారు. ‘ఒకవేళ నేను పేరు మార్చుకోవాల్సి వస్తే.. అది ఏమై ఉండాలని మీరు కోరుకుంటున్నారు? కొంచెం మంచిగా ఆలోచించి చెప్పండి’ అని రష్మిక ట్వీట్‌ చేశారు. అయితే రష్మిక పెట్టిన ట్వీట్‌పై పలువురు నెటిజన్లు స్పందించారు. ‘మేడమ్‌.. మీకు లిల్లీ(డియర్‌ కామ్రేడ్‌ చిత్రంలోని పాత్రపేరు) అనే పేరు బాగుంటుంది’ అని కొందరు చెబుతున్నారు. ‘తలా రష్మిక’, ‘మోనీ’, ‘రష్మిక విజయ్ దేవరకొండ’ అని మరికొంతమంది సమాధానమిచ్చారు. ఇదిలా ఉండగా.. ‘మీకు రష్మిక అనే పేరు బాగా నప్పుతుంది. వేరే పేర్లు కంటే మీకు మీపేరు బాగుంటుంది’ అని ఇంకొంతమంది రిప్లై ఇచ్చారు.

సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు కథానాయకుడిగా నటించిన ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంలో రష్మిక నటించారు. అనిల్‌ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 11న విడుదలై మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ప్రస్తుతం అల్లు అర్జున్‌ కథానాయకుడిగా రానున్న ‘పుష్ప’ చిత్రంలో ఆమె నటిస్తున్నారు. సుకుమార్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్‌ను లాక్‌డౌన్‌ కారణంగా కొంతకాలంపాటు వాయిదా వేసిన విషయం తెలిసిందే.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని