మేకప్‌ లేకుండా కీర్తిసురేశ్‌..!
close
Updated : 22/05/2020 11:07 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మేకప్‌ లేకుండా కీర్తిసురేశ్‌..!

వీడియో షేర్‌ చేసిన నటి

హైదరాబాద్‌: చూడచక్కని రూపం, చక్కని హావభావాలతో ప్రేక్షకులను మెప్పించిన అగ్రకథానాయిక కీర్తి సురేశ్‌. ఎప్పుడూ ఫొటోషూట్లు‌, సినిమా ప్రమోషన్లకు సంబంధించిన ఫొటోలతో ఆకట్టుకునే కీర్తి తాజాగా మేకప్‌ ప్రీ లుక్‌లో ఉన్న ఓ వీడియోను అభిమానులతో పంచుకున్నారు. ఇటీవల ఇన్‌స్టాలో ఆమెను ఫాలో అయ్యేవారి సంఖ్య 5 మిలియన్లకు చేరింది. దీంతో తనని అభిమానించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఆమె తన పెంపుడు శునకంతో కలిసి ఓ వీడియోను రూపొందించి నెట్టింట్లో పోస్ట్‌ చేశారు. ‘ఇప్పుడు మనది 5 మిలియన్ల కుటుంబం..!! మీరు నాపై చూపిస్తున్న ప్రేమాభిమానాలకు నేను, నైక్‌ ఎంతో సంతోషిస్తున్నాం’ అని ఆమె పేర్కొన్నారు. 2016 మే నెలలో మొదటిసారి కీర్తి సురేశ్‌ ఇన్‌స్టాలోకి అడుగుపెట్టారు. అప్పటి నుంచి తరచూ ఆమె ఇన్‌స్టా వేదికగా తన సినిమాల అప్‌డేట్స్‌ నెటిజన్లతో పంచుకుంటుంటారు.

బాలనటిగా పలు మలయాళీ చిత్రాల్లో నటించిన కీర్తి సురేశ్‌ ‘నేను శైలజ’తో తెలుగు తెరకు కథానాయికగా పరిచయమయ్యారు. అనంతరం ఆమె తెలుగు, తమిళంలో ఎన్నో అవకాశాలను సొంతం చేసుకున్నారు. ఇప్పటివరకూ కీర్తి.. పవన్‌కల్యాణ్‌, విజయ్‌ లాంటి అగ్రకథానాయకులతోపాటు శివకార్తికేయన్‌, నాని వంటి యువ హీరోలతో కూడా సందడి చేశారు. 2018లో విడుదలైన ‘మహానటి’ చిత్రం ఆమె కెరీర్‌లోనే ఓ ఆణిముత్యంగా నిలిచింది. సావిత్రమ్మ జీవితాన్ని ఆధారంగా చేసుకుని తెరకెక్కిన ఈ సినిమాలో కీర్తి నటనకు జాతీయ అవార్డు వరించింది. ప్రస్తుతం ఆమె ‘పెంగ్విన్‌’, ‘మిస్‌ ఇండియా’, ‘రంగ్‌ దే’ చిత్రాల్లో నటిస్తున్నారు.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని