అతడు సెట్‌లో ఉంటే నాకు నో టెన్షన్‌: ఛార్మి
close
Published : 23/05/2020 12:04 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అతడు సెట్‌లో ఉంటే నాకు నో టెన్షన్‌: ఛార్మి

హైదరాబాద్‌: ఛార్మి నిర్మాతగా పూరీ జగన్నాథ్‌ డైరెక్షన్‌లో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ‘ఫైటర్‌’ వర్కింగ్‌ టైటిల్‌తో చిత్రీకరణ జరుపుకొంటున్న ఈ సినిమాలో విజయ్‌ దేవరకొండ, అనన్యపాండే జంటగా కనిపించనున్నారు. మార్షల్‌ ఆర్ట్స్ ప్రధానాంశంగా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రానికి.. మంచి టైటిల్‌ను ఫిక్స్‌ చేశామని, త్వరలోనే ప్రకటిస్తామని ఛార్మి ఇటీవల తెలిపారు.

విజయ్‌ దేవరకొండ, అనన్యపాండేలపై ఛార్మి తాజాగా ప్రశంసల వర్షం కురిపించారు. ‘‘ఫైటర్‌’ విడుదలైన తర్వాత అనన్య తప్పకుండా ఇండియాలోనే టాప్‌ 3 ఉత్తమ నటీమణుల్లో ఒకరవుతారు. ఆమె అద్భుత ప్రతిభకలిగిన నటి. ఇక విజయ్‌ సెట్‌లో ఉంటే నాకు ఎలాంటి టెన్షన్‌, కంప్లెంట్స్‌ ఉండవు’ అని అన్నారు. ఈ ఏడాది ఆరంభంలో ‘ఫైటర్’ చిత్రీకరణ ముంబయిలో ప్రారంభమైంది. కరోనా లాక్‌డౌన్‌ కారణంగా సినిమా షూటింగ్‌ వాయిదా పడింది. పాన్‌ ఇండియన్‌ సినిమాగా ఇది తెరకెక్కుతోంది.




మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని