ఆహా ఏమి రుచి.. అనరా మైమరచి..!
close
Published : 26/05/2020 09:04 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఆహా ఏమి రుచి.. అనరా మైమరచి..!

సెలబ్రిటీల ఇంట.. పసందైన వంట..!

లాక్‌డౌన్‌లో వీడియోలతో మెప్పిస్తున్న తారలు

ఇంటర్నెట్‌డెస్క్‌‌: స్టార్ట్‌, కెమెరా, యాక్షన్‌.. ఇలాంటి డైరెక్షన్స్‌ ఏమీ లేకుండానే సినీ, బుల్లితెర తారలు షూట్స్‌లో పాల్గొని వీడియోలతో మెప్పిస్తున్నారు. నోరూరించే వంటకాలను తయారు చేసుకోవడం గురించి అభిమానులు, నెటిజన్లకు నేర్పిస్తున్నారు. తరచూ షూటింగ్స్‌తో బిజీగా ఉండే నటీనటులకు లాక్‌డౌన్‌ కారణంగా కొంత ఉపశమనం దొరికింది. దీంతో పలువురు హీరోలు గరిటె చేతపట్టి వంటింట్లోకి అడుగుపెట్టారు. మరోవైపు హీరోయిన్స్‌ సైతం తమకు నచ్చిన వంటకాలను సిద్ధం చేసేస్తున్నారు. ఇలా సినీ, బుల్లితెర సెలబ్రిటీలు తమలోని పాకశాస్త్ర ప్రావీణ్యానికి మెరుగులద్ది రుచికరమైన వంటలతో కుటుంబసభ్యుల్ని, వీడియోలతో అభిమానులను అలరిస్తున్నారు.

ఇటీవల సీనియర్‌ నటుడు మోహన్‌బాబు తన కుటుంబం కోసం ‘కిమా స్టిక్కీ ప్రైడ్‌ రైస్‌’ సిద్ధం చేయగా.. ఆయన తనయుడు విష్ణు కొబ్బరి బొండాంలో చికెన్‌ ర్రైస్‌ వండి వడ్డించారు. నటుడు శివబాలాజీ తనకెంతో ఇష్టమైన ‘గ్రిల్డ్‌ చికెన్‌’తో నోరూరించగా.. ఆయన సతీమణి మధుమిత వెజ్‌, నాన్‌వెజ్‌ వంటకాలతోపాటు సూప్స్‌ తయారుచేశారు. బుల్లితెర యాంకర్‌ అనసూయ ‘క్వారంటైన్‌ కుకింగ్‌’లో భాగంగా పలు రకాలైన ఉత్తరాది, దక్షిణాది వంటకాలతో ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. నోరూరించే ‘చికెన్‌ బిర్యానీ’ సిద్ధం చేసి వంటచేయడంలో నేనేమి తక్కువ కాదని శ్రీముఖి నిరూపించారు. వీరితోపాటు రామ్‌, సుమ సైతం వంటింట్లో గరిటె తిప్పారు. మరోవైపు కాజల్, పూజాహెగ్డే సైతం తమ వంటకాలకు సంబంధించిన ఫొటోలను నెట్టింట్లో పోస్ట్‌ చేశారు.


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని