రంజాన్‌ శుభాకాంక్షలు తెలిపిన బాలయ్య
close
Updated : 25/05/2020 14:53 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రంజాన్‌ శుభాకాంక్షలు తెలిపిన బాలయ్య

ఈద్‌ ముబారక్‌ అంటోన్న సెలబ్రిటీలు

హైదరాబాద్‌: రంజాన్‌ పర్వదినాన్ని పురస్కరించుకుని అగ్రకథానాయకుడు బాలకృష్ణ శుభాకాంక్షలు తెలిపారు. రంజాన్‌ అందరి జీవితాల్లో సుఖ సంతోషాలను నింపాలని ఆయన కోరుకున్నారు. ‘ముస్లిం మత పెద్దలు, సోదర సోదరీమణులకు నా నమస్కారం. ప్రేమ,త్యాగాలకు ప్రతీకలు ముస్లింలు . వారి క్రమశిక్షణ, భక్తి భావన, ఆధ్యాత్మికత ఆదర్శప్రాయం. ముస్లిం ప్రజలందరికీ రంజాన్‌ ఈద్‌ ముబారక్‌. లాక్‌డౌన్‌లో కూడా మనోధైర్యంగా ఉండి, కఠోర ఉపవాస దీక్షను చేపట్టి, ప్రార్థనలు చేసిన ప్రతి ఒక్కరికీ ఈద్‌ శుభాకాంక్షలు. మీ ప్రార్థనలు ఫలించాలని, కరోనా మహమ్మారి అంతం కావాలని, సకల మానవాళి బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ ఏడాది ఈద్‌ మనందరి జీవితాల్లో సంతోషాన్ని నింపాలని కోరుకుంటున్నాను’ అని బాలకృష్ణ అన్నారు.

బాలకృష్ణతోపాటు మరికొందరు సినీ ప్రముఖులు సైతం రంజాన్‌ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు వారు సోషల్‌మీడియా వేదికగా పలు ఫొటోలను, వీడియోలను పోస్ట్ చేశారు. సాయికుమార్‌, చిరంజీవి, మహేశ్‌బాబు, రామ్‌చరణ్‌, ఎన్టీఆర్‌, మంచు విష్ణు, మంచులక్ష్మి, గోపీచంద్‌, వరుణ్‌తేజ్‌, రానా, సునీల్‌తోపాటు కథానాయికలు కీర్తి సురేశ్‌, హెబ్బా పటేల్‌, మెహరీన్‌, కృతిసనన్‌, సోనమ్‌ కపూర్‌ ఈద్‌ ముబారక్‌ అని పేర్కొన్నారు.
 
 మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని