లాక్‌డౌన్‌ తర్వాత ఆ సన్నివేశాలకు దూరం
close
Published : 26/05/2020 10:09 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

లాక్‌డౌన్‌ తర్వాత ఆ సన్నివేశాలకు దూరం

హైదరాబాద్‌: ‘అందాల రాక్షసి’ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమై వరుస అవకాశాలను దక్కించుకుంటున్న నటి లావణ్య త్రిపాఠి. ప్రస్తుతం లాక్‌డౌన్‌ కారణంగా షూటింగ్‌లు వాయిదా పడటంతో ఇంట్లోనే ఉంటూ సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో ముచ్చటిస్తోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..  లాక్‌డౌన్‌, కొవిడ్‌-19 తర్వాత రొమాంటిక్‌ సన్నివేశాలకు కాస్త దూరంగా ఉంటానని చెప్పుకొచ్చింది.

‘‘లాక్‌డౌన్‌ తర్వాత షూటింగ్‌లు మొదలైనప్పుడు కొన్ని భయాలు ఉంటాయి. సెట్స్‌లో అయితే భద్రతకే మొదటి ప్రాధాన్యం. నేను, నాతో పనిచేసే సిబ్బంది ఆరోగ్యంగా ఉండేందుకు నా వంతు ప్రయత్నం చేస్తా. లాక్‌డౌన్‌ తర్వాత షూటింగ్‌ చేయడం అనేది పూర్తి భిన్నంగా ఉండబోతోంది. ప్రభుత్వ మార్గదర్శకాలను తప్పకుండా పాటిస్తాం. ఇక రొమాంటిక్‌ సన్నివేశాలకు వీలైనంత దూరంగా ఉండేందుకు ప్రయత్నిస్తా’’ అని లావణ్య త్రిపాఠి చెప్పింది.

గతేడాది ‘అర్జున్‌ సురవరం’ చిత్రంతో ఘన విజయాన్ని అందుకున్న లావణ్య ప్రస్తుతం ‘ఏ1 ఎక్స్‌ప్రెస్‌’, ‘చావు కబురు చల్లగా’చిత్రాల్లో నటిస్తోంది.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని