రకుల్‌ ఆరోగ్య రహస్యం ఇదే..!
close
Updated : 27/05/2020 13:11 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రకుల్‌ ఆరోగ్య రహస్యం ఇదే..!

హైదరాబాద్‌: తన ఆరోగ్య రహస్యాన్ని రకుల్‌ప్రీత్‌ సింగ్‌ అభిమానులతో పంచుకున్నారు. లాక్‌డౌన్‌ కారణంగా షూటింగ్స్‌ నిలిచిపోవడంతో ఇంటికే పరిమితమైన ఈ ముద్దుగుమ్మ‌.. హోమ్‌ వర్కౌట్లు, గేమ్స్‌, మూవీస్‌.. ఇలా తన క్వారంటైన్‌ లైఫ్‌ను ఆస్వాదిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఆమె.. తన మార్నింగ్‌ రొటీన్‌ గురించి తెలియజేస్తూ ఓ ప్రత్యేక వీడియో నెట్టింట్లో పోస్ట్‌ చేశారు. ప్రతిరోజూ వాటిని క్రమం తప్పకుండా పాటించడం వల్లే తాను అందంగా, ఆరోగ్యంగా ఉన్నానని తెలిపారు. ఈ విధంగా ఫాలో అయితే ఆరోగ్యవంతమైన జీవితం ప్రతి ఒక్కరి సొంతమవుతుందని సూచించారు.

‘నేను ఉదయాన్నే నిద్రలేవగానే అరలీటరు గోరువెచ్చటి నీరు తాగుతాను. కొంత సమయం తర్వాత రాత్రిపూట నానబెట్టిన మెంతులు, నల్లని ఎండు ద్రాక్ష కొద్దిగా తింటాను. ఈ రెండు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. మెంతులు తినడం వల్ల బ్లడ్‌ షూగర్‌ లెవల్స్‌ నియంత్రణలో ఉంటాయి. మరోవైపు నల్లని ఎండుద్రాక్ష వల్ల ఎముకలు ఆరోగ్యంగా మారతాయి. ఐరన్‌ కూడా పుష్కలంగా లభిస్తుంది. నల్లని ఎండుద్రాక్ష తినడం మహిళలకు ఎంతో అవసరం. ఆ తర్వాత ఒక కప్పు ఘీ కాఫీ తాగుతాను. ఇది నాకు చాలా ఇష్టమైన డ్రింక్‌. ఇది లేకుండా నా రోజు ప్రారంభం కాదు. గత రెండేళ్లుగా నా మార్నింగ్‌ లైఫ్‌లో కాఫీ భాగమైంది.’ అని రకుల్‌ తెలిపారు.

 
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని