మెట్లు.. సోఫా సెట్లు.. కాదేది వర్కౌట్లకు అనర్హం..!
close
Updated : 28/05/2020 10:05 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మెట్లు.. సోఫా సెట్లు.. కాదేది వర్కౌట్లకు అనర్హం..!

లాక్‌డౌన్‌ వేళ ఫిట్‌నెస్‌తో మెప్పించిన తారలు

ఇంటర్నెట్‌ డెస్క్‌: సెలబ్రిటీలనగానే వెంటనే గుర్తుకువచ్చేది వాళ్ల ఫిట్‌నెస్‌. వారి రోజువారీ జీవితంలో వర్కౌట్లకు ఎంతో ప్రాధాన్యం ఉంటుంది. సినిమాల్లో ఎలా కనిపించినా సరే.. నిజ జీవితంలో మాత్రం ఫిట్‌నెస్‌ విషయంలో వాళ్లు రాజీపడరు. షూటింగ్స్‌లో ఎంత బిజీగా ఉన్నాసరే సమయం దొరికినప్పుడు జిమ్‌లో వర్కౌట్లు చేస్తుంటారు. అయితే ప్రస్తుతం పరిస్థితులు మారాయి. కరోనా వైరస్‌ కారణంగా దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ విధించడంతో జిమ్‌లు మూతపడ్డాయి. దీంతో ఇంటికే పరిమితమైన సెలబ్రిటీలు హోమ్‌ వర్కౌట్లతో మెప్పించారు. ఇంట్లో ఉన్న సామాగ్రితోనే వర్కౌట్లు చేసి.. మీరు కూడా ప్రయత్నించండి అని పేర్కొంటూ నెట్టింట్లో వీడియోలను పోస్ట్‌ చేశారు.

ఫిట్‌నెస్‌కు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చే అగ్రకథానాయిక సమంత ఇటీవల ఆన్‌లైన్‌లో ఫిట్‌నెస్‌ పాఠాలు నేర్చుకున్నారు. ట్రైనర్‌ చెప్పిన విధంగా ఇంట్లోనే వర్కౌట్లు చేశారు. దానికి సంబంధించిన వీడియోను సైతం ఇన్‌స్టా వేదికగా అభిమానులతో పంచుకుని ఫిట్‌నెస్ పట్ల తనకున్న డెడికేషన్‌ను తెలియజేశారు‌. మరోవైపు తన వర్కౌట్లకు సంబంధించిన ఓ చిన్న వీడియోను మొదటిసారి నెట్టింట్లో పోస్ట్‌ చేసి అందరిచూపును తనవైపు తిప్పుకున్నారు నటి అమల. నటుడు సుధీర్‌బాబు సైతం ‘హోమ్‌ వర్కౌట్లు’లో ప్రతిరోజూ ఓ వీడియోను నెటిజన్లతో పంచుకున్నారు. మెట్లు, సోఫాసెట్లు, వాటర్‌ బాటిల్స్‌.. ఇలా వర్కౌట్లు చేయడానికి ఏదీ అనర్హం కాదని ఆయన నిరూపించారు.

మిల్కీబ్యూటీ తమన్నా యోగాతో మెప్పించగా.. రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ సూర్య నమస్కారాలు చేశారు. తమ తదుపరి సినిమాల కోసం ఆర్య, వరుణ్‌తేజ్‌.. వర్కౌట్లలో మునిగితేలారు. మరోవైపు కార్తికేయ సైతం ఇంట్లోనే ఉండి తగిన వర్కౌట్లు చేసి సిక్స్‌ప్యాక్‌ లుక్‌తో కనిపించి అందర్నీ షాక్‌కు గురిచేశారు. ఇలా క్వారంటైన్‌లో వర్కౌట్లతో మెప్పించిన సెలబ్రిటీలపై ఓ లుక్కేయండి..!
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని