ఆయనతో నటించడం నా అదృష్టం: చిరంజీవి
close
Published : 28/05/2020 13:21 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఆయనతో నటించడం నా అదృష్టం: చిరంజీవి

అపురూప చిత్రాన్ని పోస్ట్‌ చేసిన హీరో

హైదరాబాద్‌: విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావుతో కలిసి పనిచేయడం తన అదృష్టమని అగ్రకథానాయకుడు చిరంజీవి అన్నారు. గురువారం ఎన్టీఆర్‌ జయంతిని పురస్కరించుకుని ట్విటర్‌ వేదికగా ఓ అపురూప చిత్రాన్ని పోస్ట్‌ చేశారు. ‘తెలుగు జాతి పౌరుషం, తెలుగు వారి ఆత్మగౌరవం, తెలుగు నేల గుండెల్లో ఎన్నటికీ చెదరని జ్ఞాపకం. నందమూరి తారక రామారావుగారి కీర్తి అజరామరం. వారితో కలిసి నటించడం నా అదృష్టం. పుట్టినరోజునాడు ఆ మహానుభావుని స్మరించుకుంటూ...’ అని చిరు పేర్కొన్నారు. ఎన్టీఆర్‌ జయంతిని పురస్కరించుకుని నందమూరి కుటుంబసభ్యులు, సినీ ఇండస్ట్రీకి చెందిన పలువురు ప్రముఖులు సోషల్‌మీడియా వేదికగా పలు పోస్ట్‌లు పెట్టారు.

‘నా సినీ ప్రయాణంలో ఎన్నో శిఖరాలను అధిరోహించాను. మరెన్నో అవార్డులను పొందాను. వాటన్నింటి కంటే నాకు దక్కిన గౌరవం ఎన్టీఆర్‌తో కలిసి సినిమా చేయడం. దీనిని ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటాను. అలాగే నా జీవితంలో నేను పొందిన అతి పెద్ద గౌరవంగా భావిస్తాను. గతేడాది ఇదే రోజున నా తదుపరి ప్రాజెక్ట్‌ గురించి ప్రకటించాను. త్వరలోనే మిమ్మల్ని మరింత కొత్తగా అలరిస్తానని మాటిస్తున్నాను.’ - రాఘవేంద్రరావు

‘మీ పాదం మోపక తెలుగు ధరిత్రి చిన్నబోతోంది. మీ రూపు కానక తెలుగు గుండె తల్లడిల్లిపోతోంది. పెద్దమనసుతో ఈ ధరిత్రిని, ఈ గుండెని మరొక్కసారి తాకిపో తాతా..’ - ఎన్టీఆర్‌

‘ఓ విశ్వవిఖ్యాత మీ గాథ, మీ బోధ మాకు భగవద్గీత. ఓ విశ్వవిఖ్యాత మీ ఘనత, మీ చరిత నిర్మించే మా భవిత. అమరపురి అధినేత అందుకో మా జ్యోత అందుకో మా జ్యోత అందుకో మా జ్యోత’ - కల్యాణ్‌ రామ్‌

‘ఆ దేవుడు... ఎదురుగా వచ్చినా దేవుడిని కాదంటాం. ఎందుకని అడిగితే ఎన్టీఆర్ పోలిక ఒకటీ లేదంటాం’ - నారా రోహిత్‌
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని