థియేటర్లు రీఓపెన్‌-దుల్కర్‌ సినిమా సందడి
close
Published : 28/05/2020 20:57 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

థియేటర్లు రీఓపెన్‌-దుల్కర్‌ సినిమా సందడి

చాలా సంతోషంగా ఉంది: దుల్కర్‌

తిరువనంతపురం: దుల్కర్‌ సల్మాన్‌ కథానాయకుడిగా నటించిన ‘కనులు కనులను దోచాయంటే’ సినిమా మరోసారి థియేటర్లలో సందడి చేస్తోంది. రొమాంటిక్‌, సస్పెన్స్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రానికి దేసింగ్‌ పెరియసామి దర్శకత్వం వహించారు. ఫిబ్రవరిలో విడుదలైన ఈ సినిమా అటు ప్రేక్షకుల నుంచి ఇటు విమర్శకుల నుంచి మంచి స్పందనలను అందుకుంది. అయితే ఇది విడుదలైన కొన్నిరోజులకే కరోనా వైరస్‌ విజృంభిస్తోండడంతో థియేటర్లు మూతపడ్డాయి. దీంతో ‘కనులు కనులను దోచాయంటే’ చిత్రం మంచి టాక్‌ను సొంతం చేసుకున్నప్పటికీ లాక్‌డౌన్‌ కారణంగా ఎక్కువ మందికి చేరువ కాలేకపోయింది.

కాగా, తాజాగా ఈ చిత్రాన్ని రీరిలీజ్‌ చేశారు. లాక్‌డౌన్‌ తర్వాత ఇటీవల దుబాయ్‌లో థియేటర్లు పునఃప్రారంభమయ్యాయి. థియేటర్లలో పాటించాల్సిన నియమ నిబంధనల గురించి అక్కడి ప్రభుత్వం వివరించింది. ఈ నేపథ్యంలో మే 27 నుంచి ‘కనులు కనులను..’ చిత్రాన్ని అక్కడి థియేటర్లలో ప్రదర్శిస్తున్నారు. ఈవిషయాన్ని తెలియజేస్తూ దుల్కర్‌ ఇన్‌స్టా స్టోరీస్‌లో ఓ పోస్ట్‌ పెట్టారు. చాలా రోజుల తర్వాత థియేటర్లలో సినిమా సందడి చేయడం చూస్తుంటే తనకెంతో సంతోషంగా ఉందని ఆయన పేర్కొన్నారు. రీతూవర్మ కథానాయికగా నటించిన ఈ చిత్రంలో గౌతమ్‌ మేనన్‌ ఓ కీలకపాత్రను పోషించారు.

 
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని