14వేల మంది సినీ కార్మికుల‌ కుటుంబాల కోసం..
close
Updated : 28/05/2020 15:31 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

14వేల మంది సినీ కార్మికుల‌ కుటుంబాల కోసం..

హైదరాబాద్‌: కరోనా వైరస్‌, లాక్‌డౌన్‌ కారణంగా చిత్రీకరణలు వాయిదా పడటంతో ఇండస్ట్రీనే నమ్ముకుని ఉన్న సినీ-టీవీ కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అలాంటి వారికి సాయం అందించేందుకు తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్ర‌ఫీ మంత్రి త‌ల‌సాని శ్రీ‌నివాస యాద‌వ్,  తలసాని సాయికిరణ్ యాదవ్  ముందుకు వచ్చారు. 14 వేల మంది సినీకార్మికుల‌ కుటుంబాలకు త‌ల‌సాని ట్రస్ట్ ద్వారా నిత్యావ‌స‌రాల సాయం చేసే కార్యక్రమాన్ని గురువారం ప్రాంరంభించారు.

అన్నపూర్ణ సెవెన్‌ ఏకర్స్‌లో జరిగిన కార్యక్రమంలో సినీ ప్రముఖులు అక్కినేని నాగార్జున, ఎస్‌.ఎస్‌.రాజమౌళి, త్రివిక్రమ్‌, దిల్‌రాజు, కొరటాల శివ, రాధాకృష్ణ, రామ్మోహనరావు, తలసాని సాయి, ఎన్‌.శంకర్‌, సి.కల్యాణ్‌, అభిషేక్‌, కాదంబరి కిరణ్‌ తదితరులు పాల్గొన్నారు. వీరి చేతుల మీదుగా పలువురు సినీ కార్మికులకు నిత్యావసరాలు పంపిణీ చేశారు. మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని