వెంటనే ‘మహానటి’ చూడండి: దీపిక
close
Published : 29/05/2020 20:38 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

వెంటనే ‘మహానటి’ చూడండి: దీపిక

ముంబయి: బాలీవుడ్‌ ముద్దుగుమ్మ దీపికా పదుకొణె తెలుగు చిత్రం ‘మహానటి’కి ఫిదా అయ్యారు. తాజాగా ఈ సినిమాను చూసిన ఆమె ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా అభిప్రాయాన్ని పంచుకున్నారు. ‘వెంటనే ఈ సినిమా చూడండి’ అంటూ ‘మహానటి’ పోస్టర్‌ను షేర్‌ చేశారు. దీన్ని చూసిన చిత్ర దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ స్పందిస్తూ.. ‘తెల్లవారుజామున కూల్‌ నోటిఫికేషన్‌తో నిద్రలేచా’నని అన్నారు. అలనాటి తార సావిత్రి జీవితం ఆధారంగా తీసిన సినిమా ‘మహానటి’. కీర్తి సురేశ్‌ టైటిల్‌ రోల్‌ పోషించారు. వైజయంతి మూవీస్‌, స్వప్న సినిమా సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. 2018లో విడుదలైన ఈ సినిమా విమర్శకులతో పాటు ప్రముఖుల ప్రశంసలు పొందింది. ఈ చిత్రానికి గానూ కీర్తి సురేశ్‌ ఉత్తమ నటిగా జాతీయ అవార్డు అందుకున్నారు. పలు అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో ఈ సినిమాను ప్రదర్శించారు.

దీపిక ప్రస్తుతం తన భర్త రణ్‌వీర్‌ సింగ్‌తో కలిసి ముంబయిలోని ఇంట్లో క్వారంటైన్‌లో ఉన్నారు. ఈ స్వీయ నిర్బంధంలో తనను తాను బిజీగా ఉంచుకుంటున్నారు. ఈ క్రమంలో తీసిన వివిధ ఫొటోలు, వీడియోలను ఆమె సోషల్‌మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. దీపికలాగే నటుడు విక్కీ కౌశల్‌ కూడా దక్షిణాది సినిమాల్ని చూస్తున్నారు. వెట్రిమారన్‌ దర్శకత్వం వహించిన తమిళ సినిమా ‘విశారణై’, జకారియా మహ్మద్‌ తీసిన మలయాళ చిత్రం ’సుడానీ ఫ్రమ్‌ నైజీరియా’ను వీక్షించినట్లు తెలిపారు. అంతేకాదు రెండు సినిమాలు అద్భుతంగా ఉన్నాయని మెచ్చుకున్నారు.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని