టిక్‌టాక్‌లో మంచులక్ష్మి వీడియో వైరల్‌
close
Updated : 07/08/2020 10:09 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

టిక్‌టాక్‌లో మంచులక్ష్మి వీడియో వైరల్‌

తండ్రిని ఇమిటేట్ చేసిన నటి

హైదరాబాద్‌: తన తండ్రి, సీనియర్‌ నటుడు మోహన్‌బాబు మేనరిజమ్‌ను ఇమిటేట్‌ చేశారు నటి మంచులక్ష్మి. లాక్‌డౌన్‌ కారణంగా ఇంట్లో సరదాగా గడుపుతున్న ఆమె ఇటీవల టిక్‌టాక్‌లోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. తన కుమార్తె విద్యా నిర్వాణతో కలిసి ఫన్నీ వీడియోలను రూపొందించి టిక్‌టాక్‌ వేదికగా అభిమానులను అలరిస్తున్నారు. ఇదిలా ఉండగా తాజాగా మంచులక్ష్మి తన తండ్రిని ఇమిటేట్‌ చేస్తూ.. ఆయన సినిమాలోని ఓ డైలాగ్‌కు టిక్‌టాక్‌ చేశారు. ‘నిన్న జరిగింది మర్చిపోను. నేడు జరగాల్సింది వాయిదా వేయను. రేపు జరగబోయేదాని గురించి ఆలోచించను’ అంటూ మోహన్‌బాబులాగా హావభావాలను పలికించబోయారు. ఈ వీడియో షేర్‌ చేసిన ఆమె.. ‘నాన్న మేనరిజమ్‌ను ప్రయత్నించాను. కానీ ఆయన స్థాయిని అందుకోలేకపోయాను’ అని పేర్కొన్నారు.

కాగా, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులతో మంచులక్ష్మి గత కొంతకాలంగా ‘లాక్డ్‌ అప్‌ విత్‌ లక్ష్మి’ పేరుతో పలు వీడియోలను రూపొందిస్తున్నారు. ఇందులో భాగంగా విద్యా, ఆరోగ్య, సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులతో ఇన్‌స్టా లైవ్‌లో మాట్లాడి ఎన్నో ఆసక్తికర విషయాలను ప్రజలకు తెలియజేస్తున్నారు. ఇటీవల రానాతో నిర్వహించిన ఇంటర్వ్యూ ఎంతగానో ఆకట్టుకుంది. 2018లో విడుదలైన ‘Mrs.సుబ్బలక్ష్మి’ వెబ్‌సిరీస్‌లో మంచులక్ష్మి చివరిసారిగా కనిపించారు.

ఇదీ చదవండి

పెళ్లిరోజు చాలా కంగారుపడ్డా: మంచులక్ష్మి
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని