మేకప్‌ లేకుండా ముద్దుగుమ్మల్ని చూశారా..?
close
Updated : 01/06/2020 09:04 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మేకప్‌ లేకుండా ముద్దుగుమ్మల్ని చూశారా..?

ఓ సెలబ్రిటీ అందం వెనుక ఎంత కథో

నటి ఎంత అందంగా ఉందో..! ఆమె చర్మం మెరిసిపోతోంది కదా.. ఇలాంటి మాటలు మనం చాలానే వింటుంటాం. సెలబ్రిటీల్లా అందంగా కనిపించేందుకు అమ్మాయిలు ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే వారి అందం ‘మేకప్‌’ అనే ముసుగు మాత్రమే. దాదాపు మనం తెరపై చూసే ఏ నటీ సహజంగా అలా ఉండరు. చిత్ర పరిశ్రమనే రంగుల ప్రపంచంలో అడుగుపెట్టిన తర్వాత ముఖానికి రంగు అద్దుకుని.. కెమెరా ముందుకొస్తుంటారు. వెండితెర ముద్దుగుమ్మలు మేకప్‌ లేకుండా కెమెరా ముందుకు రావడం కష్టమే. అలా ముఖాన్ని చూపించే సాహసం నటీమణులు దాదాపు చేయరు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది.. మా నిజమైన అందం ఇదేనంటూ నటీమణులు ఫాలోవర్స్‌కు చెబుతున్నారు. నిత్యం మేకప్‌తో ఉండటం, దీని కోసం గంటలు గంటలు కేటాయించడం ఇబ్బందిగా ఉంటుందని అంటున్నారు. ఓ నటి సిద్ధమై జనాల్లోకి రావాలంటే దాదాపు గంటన్నర సమయం కావాలి. దీని కోసం కనీసం ఐదారుగురు పనిచేయాలి.

ఇదే విషయాన్ని చాలా మంది నటీమణులు సోషల్‌మీడియా వేదికగా ఇప్పటికే చెప్పారు. గతంలో కాజల్‌ మేకప్‌ లేకుండా ఓ ఫొటోను షేర్‌ చేసి అందర్నీ ఆశ్చర్యపరిచారు. మన తారలు కెమెరా ముందు ఎలా ఉంటారో చూశాం.. ఇప్పుడు కెమెరా వెనుక ఎలా ఉంటారో.. వారు అందానికి ఎలాంటి నిర్వచనం ఇచ్చారో చూడండి.

‘ప్రతి అమ్మాయి బెడ్‌రూమ్‌లోని తన అద్దం ముందు నిల్చొని.. నేనెందుకు సెలబ్రిటీలా లేను అనుకుంటుంది. ఎవరూ అందంగా నిద్రలేవరనే విషయాన్ని మీరు తెలుసుకోండి. నాకేకాదు.. ఏ నటికీ అది సాధ్యం కాదు. మేం ఓ సారి పబ్లిక్‌లోకి రావాలంటే కనీసం 90 నిమిషాలు మేకప్‌ కుర్చీపై కూర్చోవాల్సి వస్తుంది. నా జుట్టు, మేకప్‌, గోళ్లకు మెరుగులు దిద్దడానికి ఆరుగురు పనిచేస్తారు. నా కనుబొమ్మల్ని వారానికి ఓసారి సరిచేస్తుంటారు. నా దుస్తుల్ని టీం సిద్ధం చేస్తుంది. ఓ నటి అందంగా ఉండాలంటే.. ఆర్మీ అవసరం. ఎంతో డబ్బు, సమయం ఖర్చు చేయాల్సి ఉంటుంది.. మీరు చూసేదంతా నిజం కాదు’ - సోనమ్‌ కపూర్‌

‘అందం అంటే మనల్ని మనం స్వీకరించుకోవడం. మేకప్‌ లేని ఫొటో షేర్ చేయడానికి ధైర్యం కావాలి. మనం శారీరక ఆకర్షణకు క్రేజ్‌ ఉన్న ప్రపంచంలో జీవిస్తున్నాం. అందం కోసం లక్షలు వెచ్చిస్తున్నాం. అనేక ఉత్పత్తులు మనల్ని అందంగా చూపిస్తున్నాయి.  శరీరాకర్షణ ప్రతి చోటా ఉంది. మనలోని భిన్నమైన వ్యక్తిని చూపించాలి అనుకోకుండా.. మనల్ని మనం సహజంగా స్వీకరించుకోవడం మొదలు పెట్టినప్పుడు నిజంగా ఆనందంగా ఉంటాం. మేకప్‌ మనల్ని బాహ్యంగా అందంగా తయారు చేస్తుంది. అంతేకానీ మన వ్యక్తిత్వాన్ని, ఉనికిని మారుస్తుందా?మనల్ని మనం స్వీకరించడంలోనే నిజమైన ఆనందం ఉంది’ -కాజల్‌

‘నేను ఇన్‌స్టాలో లైవ్‌కి వచ్చినప్పుడు చాలా మంది నన్ను అనేక ప్రశ్నలు అడిగారు. ‘మీ అందం రహస్యం ఏంటి?, చక్కని జుట్టు కోసం ఏం వాడుతున్నారు?..’ అని రకరకాల కామెంట్లు చేశారు. అవి నన్ను చాలా లోతుగా ఆలోచించేలా చేశాయి. మనుషులుగా మనం దుస్తులు వేసుకుంటాం.. అలాగే ఒక ఆర్టిస్ట్‌గా మేమంతా మేకప్ వేసుకుంటాం. కానీ మనం చూడాల్సింది పైకి కనిపించే అందం కాదు.. లోపల ఉన్న అంతరాత్మని. దాన్ని చూపించడానికి అస్సలు సిగ్గు పడకూడదు. అందుకే ఇలా మేకప్ లేకుండా మీ ముందుకు వచ్చా. నాకు మేకప్ అంటే ఇష్టమే కానీ.. నిజమైన ప్రేమ దాంతో దొరకదు. కుటుంబం మనపై చూపించే ప్రేమలోనే అంతా ఉంటుంది. మన వ్యక్తిత్వాన్ని ఏ మేకప్‌ దాచిపెట్టలేదు. అదే నిజమైన అందం. మిమ్మల్ని మీరు స్వీకరించండి.. అందంగా ఉండండి’ -అనసూయ

‘మేకప్‌ లేకుండా ఎవరూ అందంగా కనిపించరు’: కత్రినా కైఫ్‌

కీర్తి సురేశ్‌

జాక్వైలైన్‌ ఫెర్నాండేజ్‌

దీపిక పదుకొణె

సమంత

ప్రియాంక చోప్రా

తమన్నా

రష్మి గౌతమ్‌

-ఇంటర్నెట్‌డెస్క్‌, ప్రత్యేకం




మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని