వారిపై కేసు పెడతా: నటుడు రావు రమేశ్‌
close
Updated : 30/05/2020 22:11 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

వారిపై కేసు పెడతా: నటుడు రావు రమేశ్‌

హైదరాబాద్‌: సోషల్ మీడియాలో తనకు ఎటువంటి ఖాతాలూ లేవని ప్రముఖ నటుడు రావు రమేశ్‌ స్పష్టం చేశారు. కొందరు వ్యక్తులు ఆయన పేరుపై ట్విటర్‌ ఖాతాను నడుపుతున్నారు. అధికారంలో ఉన్న ఓ రాజకీయ పార్టీ తీరుపై అసహనం వ్యక్తం చేస్తూ ట్వీట్లు చేశారు. ఈ నేపథ్యంలో రావు రమేశ్‌ ప్రకటన చేశారు. ‘నాకు సోషల్‌మీడియాలో ఎలాంటి అకౌంట్లూ లేవు. ఫేస్‌బుక్‌, ట్విటర్‌, ఇన్‌స్టాగ్రామ్‌.. ఇలా దేన్నీ ఉపయోగించడం లేదు. శనివారం నా పేరు మీద ట్విటర్‌లో పోస్ట్‌లు పెట్టారు. వాటికీ, నాకూ ఎలాంటి సంబంధమూ లేదు. దయచేసి వాటిని నమ్మకండి. నేనేదైనా మాట్లాడాలనుకుంటే పత్రికా ముఖంగా తెలియజేస్తా. త్వరలోనే నా పేరు మీద ఇలా తప్పుడు ఖాతా నడుపుతున్న వారిపై పోలీస్‌ స్టేషన్‌లో కేసు పెట్టబోతున్నా’ అని ఆయన పేర్కొన్నారు.

‘యాక్టర్‌ రావు రమేశ్‌’ పేరుతో కొందరు ట్విటర్‌లో 2020 మేలో ఖాతాను ప్రారంభించారు. ఈ ఖాతాను 2,500 మంది ఫాలో అవుతున్నారు. ఇందులో చేసిన పోస్ట్‌లకు వందల మంది కామెంట్లు చేశారు. ఈ నేపథ్యంలో రావు రమేశ్‌ స్పందించారు. గతేడాది దాదాపు 12 తెలుగు సినిమాల్లో కనిపించిన ఆయన ఈ ఏడాది ‘సరిలేరు నీకెవ్వరు’లో సందడి చేశారు. నాగచైతన్య, సాయిపల్లవి జంటగా శేఖర్‌ కమ్ముల దర్శకత్వం వహిస్తున్న ‘లవ్‌స్టోరీ’లోనూ కనిపించబోతున్నారు. లాక్‌డౌన్‌ కారణంగా ఈ సినిమా విడుదల వాయిదా పడింది.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని