మీమ్‌ పేజీల గురించి సమాచారం ఇవ్వండి
close
Published : 31/05/2020 14:27 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మీమ్‌ పేజీల గురించి సమాచారం ఇవ్వండి

గాయని చిన్మయి

చెన్నై: ప్రముఖ గాయని చిన్మయి నెటిజన్లను ఓ సాయం కోరారు. తన గురించి అసభ్యకరంగా మీమ్స్‌ క్రియేట్‌ చేస్తున్న పేజీల సమాచారం ఇవ్వాలని అడిగారు. ‘మీ అందరి నుంచి ఓ సాయం కోరుతున్నా. మీరు మీమ్‌ పేజీల ఫాలోవర్స్‌ అయితే నా గురించి అసభ్యకరంగా ఏమైనా మీమ్స్‌, కామెంట్స్ చూసి ఉంటే ఆ స్క్రీన్‌షార్ట్స్‌ దయచేసి పంపించండి. మీకు సంబంధించిన వివరాలను నేను ఎక్కడా బయటపెట్టను. తెలుగు సోషల్‌మీడియా మీమ్స్‌ పేజీలను ఎక్కువగా నేను ఫాలో అవ్వను. దీనితోపాటు నటీమణుల గురించి ఏమైనా అసభ్యకరమైన సమాచారం చూస్తే అది కూడా పంపించండి. ధన్యవాదాలు’ అని చిన్మయి పేర్కొన్నారు.  దీంతో పలువురు నెటిజన్లు ఆమెకు కొన్ని స్ర్కీన్‌షార్ట్స్‌ పంపిస్తున్నారు. వాటిని ఆమె ఇన్‌స్టా స్టోరీస్‌లో పోస్ట్‌ చేస్తోన్నారు.

ఎన్నో చిత్రాల్లో మధురమైన పాటలు పాడి చిన్మయి ప్రేక్షకులను అలరించారు. గాయనిగానే కాకుండా సమంత నటించిన పలు చిత్రాలకు ఆమె డబ్బింగ్‌ చెప్పారు. సమంత కథానాయికగా పరిచయమైన ‘ఏ మాయ చేసావె’ చిత్రానికి గాను 2010లో బెస్ట్‌ ఫిమేల్‌ డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌గా చిన్మయి నంది అవార్డు అందుకున్నారు. ఇటీవల ఆమె అలపించిన ‘96’, ‘జాను’ చిత్రాల్లోని పాటలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. గతేడాది విడుదలైన ‘96’ చిత్రంలోని ‘కాదలే కాదలే’ పాట ఆమెకు ఎన్నో అవార్డులను అందించింది.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని