అనితరసాధ్యం ఆయన ట్రాక్‌ రికార్డ్‌..!
close
Updated : 20/07/2021 18:26 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అనితరసాధ్యం ఆయన ట్రాక్‌ రికార్డ్‌..!

సూపర్‌స్టార్‌కు శుభాకాంక్షల వెల్లువ

హైదరాబాద్‌: కథానాయకుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా సూపర్‌స్టార్‌ కృష్ణ సాధించిన ట్రాక్‌ రికార్డు అనితరసాధ్యం అని మెగాస్టార్‌ చిరంజీవి అన్నారు. ఆదివారం కృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఆయన సోషల్‌మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. ‘కథానాయకుడిగా 345 సినిమాలు, దర్శకుడిగా 14 చిత్రాలు, నిర్మాతగా తెలుగుతోపాటు పలు భారతీయభాషల్లో 50 సినిమాలు.. మొదటి సినిమాస్కోప్ చిత్రం ఆయనదే. మొదటి 70ఎంఎం సినిమా కూడా ఆయనదే. అనితరసాధ్యం ఈ ట్రాక్‌ రికార్డ్‌. సాహసానికి మారుపేరు, పద్మభూషణ్ అవార్డు గ్రహీత, సూపర్‌స్టార్‌ కృష్ణ గారికి జన్మదిన శుభాకాంక్షలు.’ అని చిరంజీవి పేర్కొన్నారు. చిరంజీవితోపాటు పలువురు సినీ ప్రముఖులు, సూపర్‌స్టార్‌ అభిమానులు కృష్ణకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

‘నేను మీలా ఉండడానికి ప్రయత్నిస్తున్నాను. ప్రతి విషయంలోనూ మీకు ఎప్పటికీ రుణపడి ఉంటాను. హ్యాపీ బర్త్‌డే నాన్న. మీరు ఎప్పటికీ నా ఎవర్‌గ్రీన్‌ సూపర్‌స్టార్‌’ - మహేశ్‌బాబు

‘ఇప్పటికీ, ఎప్పటికీ మీరు ఒక్కరే సూపర్‌స్టార్‌. ఆరోగ్యవంతమైన జీవితం మీ సొంతం కావాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను. కృష్ణ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు’ - నారా రోహిత్‌

‘ఓ అభిమానిగా సూపర్‌స్టార్‌కు ఈ వీడియో అంకితం. ఆయన కెరీర్‌లోనే అద్భుత చిత్రంగా పేరుపొందిన ‘అల్లూరి సీతారామరాజు’ నుంచి నాకు ఎంతో ఇష్టమైన సన్నివేశం. హ్యాపీ బర్త్‌డే మామయ్య’ - సుధీర్‌ బాబు

‘డేరింగ్‌, డాషింగ్‌ సూపర్‌స్టార్‌కి జన్మదిన శుభాకాంక్షలు. గతేడాది ఇదే రోజున మహేశ్‌బాబు, దిల్‌రాజు, అనిల్‌సుంకరతో ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా నవ్వుల ప్రయాణం ప్రారంభమైంది. మరొక్కసారి ఆ టీం మొత్తానికి ధన్యవాదాలు’ - అనిల్‌ రావిపూడి

‘సూపర్‌స్టార్‌, ఐకాన్‌, లెజెండ్‌, ఎన్నో లక్షల మందికి స్ఫూర్తి.. అందరికీ ఆయన ఇలా తెలుసు. కానీ నాకు మాత్రం ఆయన ప్రేమను పంచే మామయ్య. ఏదైనా విషయంలో సలహా కావాలన్నా ఆయన ముందుంటారు. ప్రతీ సమయంలో నాకు వెన్నుదన్నుగా ఉంటున్నందుకు చాలా సంతోషిస్తున్నాను. తండ్రిలేని లోటుని తీర్చారు. ఆయనలాగా చాలా తక్కువమంది ఉంటారు. హ్యాపీ బర్త్‌డే మామయ్యగారు. మీరు నా జీవితంలో ఉండడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నా.’ - నమ్రత






మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని