పవన్‌ నాకు మామిడి పండ్లు పంపలేదు: అలీ
close
Published : 02/06/2020 10:43 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పవన్‌ నాకు మామిడి పండ్లు పంపలేదు: అలీ

హైదరాబాద్‌: జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ ఏటా తనకు ఆర్గానిక్‌ మామిడి పండ్లు పంపేవారని, ఈ ఏడాది ఇంకా పంపలేదని సినీ నటుడు అలీ అన్నారు. పవన్‌తో తనకున్న అనుబంధం గురించి తాజాగా ఓ టెలివిజన్‌ ఛానల్‌లో మాట్లాడారు. చిరంజీవి కుటుంబానికి తనంటే ఎంతో ఇష్టమని ఫంక్షన్‌ జరిగినా తనని పిలుస్తారని చెప్పుకొచ్చారు. 

‘‘అన్నయ్య చిరంజీవి కోసం ఆయన ఇంటికి వెళ్లినప్పుడు పవన్‌కల్యాణ్‌ అక్కడ ఉండేవారు. అప్పటికి ఆయన చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టలేదు. సరదాగా సినిమా కబుర్లు చెప్పుకొనే వాళ్లం. పవన్‌ తొలి చిత్రం ‘అక్కడ అమ్మాయి.. ఇక్కడ అబ్బాయి’తో పాటు గతంలో ‘అజ్ఞాతవాసి’  మినహా ఆయన నటించిన అన్ని చిత్రాల్లో నటించా. ‘తొలి ప్రేమ’ నుంచి మా జర్నీ బాగా సాగింది. మా ఇద్దరి కాంబినేషన్‌లో వచ్చిన చివరి చిత్రం ‘కాటమరాయుడు’’

‘‘మిమ్మల్ని చూడగానే పవన్‌ పగలబడి నవ్వుతారెందుకు’ అని చాలామంది అడుగుతారు. మా ఇద్దరి మధ్య కొన్ని సైగలు ఉంటాయి. అవి ఆయనకు మాత్రమే అర్థమవుతాయి. అందుకే ఆయన నవ్వుతారు. బ్రహ్మానందంగారంటే కూడా బాగా ఇష్టం. చిరంజీవిగారింట్లో ఏ ఫంక్షన్‌ జరిగినా నన్ను, బ్రహ్మానందంగారిని తప్పకుండా పిలుస్తారు. ప్రతి సంవత్సరం చిరంజీవిగారు ఇంటి ఆవకాయ పంపిస్తారు. పవన్‌కల్యాణ్‌గారు కూడా ఆర్గానిక్‌మామిడి పండ్లు పంపేవారు. రాజకీయాల్లో బిజీగా ఉండటం వల్ల ఈ ఏడాది నాకు పంపలేదు. వచ్చే ఏడాది పంపుతారేమో చూడాలి’’ అని అలీ చెప్పుకొచ్చారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని