కేసీఆర్‌కు నేనంటే కోపం లేదు: బాలకృష్ణ
close
Published : 01/06/2020 21:02 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కేసీఆర్‌కు నేనంటే కోపం లేదు: బాలకృష్ణ

హైదరాబాద్‌: కరోనా కారణంగా చిత్రీకరణలు ఆగిపోవడం, చిత్ర పరిశ్రమలో నెలకొన్న సమస్యలను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్లేందుకు ఇటీవల పలువురు సినీ ప్రముఖులు ఆయనను కలిసిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో తనను ఎందుకు పిలవలేదో తెలియదని సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో దాని గురించి ఆయన ప్రస్తావించారు.

‘‘సీఎం కేసీఆర్‌ను కలవడానికి వాళ్లంతా వెళ్లినప్పుడు నన్నెందుకు పిలవలేదో నాకు తెలియదు. ఒకవేళ గతంలో నేను రాజకీయ కోణంలో ఆయనపై చేసిన విమర్శల కారణంగా నన్ను పిలవకపోతే ఆ విషయం నాకు చెప్పాల్సింది. కేసీఆర్‌గారికి నా మీద ఎప్పుడూ కోపం లేదు. రాజకీయం వేరు.. ఇది వేరు. రామారావుగారి అభిమానిగా నేనంటే కేసీఆర్ ‌గారికి పుత్ర వాత్సల్యం ఉంది. మిగిలిన వాటి గురించి నేను మాట్లాడదలుచుకోలేదు’’ అని బాలకృష్ణ చెప్పుకొచ్చారు. 

ఇక జూనియర్‌ ఎన్టీఆర్‌ రాజకీయాల్లో రావడంపైనా బాలకృష్ణ స్పందించారు. ఎన్టీఆర్‌కు నటుడిగా ఎంతో భవిష్యత్‌ ఉందన్నారు. అయితే, రాజకీయాల్లో రావడం అనేది అతని ఇష్టమని, వృత్తిని వదులుకుని రమ్మని చెప్పలేమన్నారు. ఇప్పుడు తాను, ఒకప్పుడు తన తండ్రి ఒకేసారి సినిమాలు, రాజకీయాల్లో క్రియాశీలంగా ఉన్నట్లు చెప్పారు. రాజకీయాల్లో రావడం అనేది వాళ్ల సొంత నిర్ణయమన్నారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని