సమంత పాత్రలో చూడాలని ఉంది..!
close
Updated : 03/06/2020 10:04 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సమంత పాత్రలో చూడాలని ఉంది..!

రష్మికను కోరిన అభిమానులు

హైదరాబాద్‌: ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ చిత్రంలో ‘గీత’ అనే క్యూట్‌ అమ్మాయిగా సమంత నటన ప్రతి ఒక్కరినీ ఎంతగానో ఆకట్టుకుంది. అటువంటి పాత్రలో రష్మికను చూడాలనుకుంటున్నారు నెటిజన్లు. లాక్‌డౌన్‌ కారణంగా కుటుంబసభ్యులతో సరదాగా గడుపుతున్న రష్మిక తాజాగా ట్విటర్‌ వేదికగా తాను ఎలాంటి పాత్రల్లో నటిస్తే చూడాలని ఆకాంక్షిస్తున్నారో చెప్పమని అభిమానులను కోరింది. ‘భవిష్యత్తులో నన్ను ఎలాంటి పాత్రల్లో, సినిమాల్లో చూడాలని మీరు కోరుకుంటున్నారు? మీ సమాధానాలు తెలుసుకోవాలని ఎంతో ఉత్సుకతగా ఉన్నాను. కాబట్టి త్వరగా సమాధానం తెలియజేయండి’ అని రష్మిక ట్వీట్‌ చేసింది. ఆమె ట్వీట్‌ చూసిన నెటిజన్లు.. ‘మీరు మరోసారి లిల్లీ(డియర్‌ కామ్రేడ్‌) పాత్రలో నటిస్తే చూడాలని ఉంది’, ‘గీత (గీతగోవిందం) పాత్ర మీకు బాగా నప్పుతుంది’, ‘హారర్ చిత్రాల్లో నటించండి’, ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ చిత్రంలో సమంత పోషించిన పాత్ర లాంటి క్యూట్‌ రోల్‌ మీకు బాగుంటుంది. అలాంటివి చేయండి’ అని కామెంట్లు చేశారు.

కన్నడలో తెరకెక్కిన ‘కిర్రాక్‌ పార్టీ’ చిత్రంతో రష్మిక కథానాయికగా తెరంగేట్రం చేసింది. 2018లో విడుదలైన ‘ఛలో’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. అదే ఏడాదిలో విడుదలైన ‘గీత గోవిందం’ చిత్రం ఆమెకు మంచి పేరు తీసుకువచ్చింది. విజయ్‌ దేవరకొండ కథానాయకుడిగా తెరకెక్కిన ఈ చిత్రంలో రష్మిక నటనకు ప్రేక్షకులు మంచి మార్కులు వేశారు. గతేడాది విడుదలైన ‘డియర్‌ కామ్రేడ్‌’ చిత్రంతో విజయ్‌-రష్మిక జంట మరోసారి ప్రేక్షకులను అలరించింది. అలాగే ఈ ఏడాది విడుదలైన ‘సరిలేరు నీకెవ్వరు’, ‘భీష్మ’ చిత్రాలు ఆమెకు మంచి విజయాన్ని అందించాయి. ప్రస్తుతం రష్మిక  చేతిలో ‘పుష్ప’ చిత్రంతోపాటు తమిళ, కన్నడ చిత్రాలు ఉన్నాయి. బన్నీ కథానాయకుడిగా తెరకెక్కుతున్న ‘పుష్ప’ చిత్రానికి సుకుమార్‌ దర్శకత్వం వహిస్తున్నారు.

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని