తను నన్ను చిన్నపిల్లలా చూస్తుంది..!
close
Updated : 05/06/2020 08:24 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

తను నన్ను చిన్నపిల్లలా చూస్తుంది..!

శ్రుతిహాసన్‌ నా బెస్ట్‌ ఫ్రెండ్‌: తమన్నా

హైదరాబాద్‌: శ్రుతిహాసన్‌, తమన్నా మంచి స్నేహితులనే విషయం ప్రతి ఒక్కరికీ తెలిసిందే. శ్రుతిహాసన్‌ అంటే తనకెంతో ఇష్టమని తమన్నా ఇప్పటికే పలు సందర్భాల్లో తెలియజేశారు. తాజాగా ఆమె మరోసారి శ్రుతి అంటే తనకెంత ఇష్టమో వివరించారు. అంతేకాకుండా శ్రుతిహాసన్‌లో తనకి బాగా నచ్చిన విషయాన్ని అందరితో పంచుకున్నారు. లాక్‌డౌన్‌ కారణంగా ఇంటికే పరిమితమైన తమన్నా తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు.

‘ఇండస్ట్రీలోని నటీనటులందరి కంటే నాకు శ్రుతిహాసన్‌ ఎక్కువ ఇష్టం. తనే నా బెస్ట్‌ ఫ్రెండ్‌. ముంబయిలో మా ఇంటికి దగ్గర్లోనే వాళ్ల ఇల్లు కూడా. కాబట్టి మేము తరచూ కలుసుకునేవాళ్లం. ఫోన్లో మాట్లాడుకునేవాళ్లం. మేమిద్దరం ఒకచోట కలిస్తే సాధారణంగా మా జీవితాల గురించి ఎక్కువగా మాట్లాడుకుంటాం. శ్రుతికి నెగిటివిటీ అంటే ఇష్టం ఉండదు. ఆ గుణమే మేమిద్దరం మంచి స్నేహితులమయ్యేలా చేసింది. అంతేకాకుండా ఇప్పటికీ తను నన్ను ఓ చిన్నపిల్లలానే చూస్తుంది.’ అని తమన్నా తెలిపారు. గోపీచంద్‌ కథానాయకుడిగా తెరకెక్కుతున్న ‘సిటీమార్‌’లో తమన్నా నటిస్తోంది. సంపత్‌ నంది దర్శకత్వం వహిస్తున్నారు. మరోవైపు శ్రుతిహాసన్‌ సైతం ‘క్రాక్‌’ చిత్రంలో నటిస్తున్నారు. గోపీచంద్‌ మలినేని దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రవితేజ కథానాయకుడు.


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని